Site icon HashtagU Telugu

Aadhaar card: మీ ఆధార్ ను ఎక్కడెక్కడ ఉపయోగించబడిందో చెక్ చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి?

Mixcollage 21 Jan 2024 03 08 Pm 4620

Mixcollage 21 Jan 2024 03 08 Pm 4620

ఈ రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. దాంతో ఎక్కడికి వెళ్లాలి అన్న కూడా ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లడం అన్నది తప్పనిసరి. ప్రభుత్వ ప్రైవేటు పథకాలకు ఎలాంటి వాటికైనా సరే ఆధార్ కార్డు ఉండాల్సిందే. మరి అలాంటి ఆధార్ కార్డు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఆధార్ ద్వారా మోసాలు చేయడం ఎక్కువ అయిపోయింది. కాబట్టి మీరు మీ ఆధార్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆధార్ ఎక్కడ ఉపయోగించబడుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అయితే మీ ఆధార్ హిస్టరీని మీరు సులభంగా తెలుసుకోవచ్చట.

మరి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆధార్‌ను తయారు చేసే సంస్థ..UIDAI ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ హిస్టరీని చెక్ చేసే సౌకర్యాన్ని అందిస్తోంది. ఒక వ్యక్తి ఆధార్ కార్డ్ ఎక్కడ ఉపయోగించబడుతుందో ఆధార్ హిస్టరీ మనకు తెలియజేస్తుంది? ఇది మొదట ఎక్కడ ఉపయోగించబడింది? మీ ఆధార్ కార్డ్ ఏయే డాక్యుమెంట్లతో లింక్ చేయబడిందో కూడా తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డ్ హోల్డర్ గత ఆరు నెలల ప్రామాణీకరణ రికార్డును చెక్ చేయవచ్చు. ఒకేసారి గరిష్టంగా 50 రికార్డులను తనిఖీ చేయవచ్చు. దీనితో, తమ ఆధార్‌ను ఉపయోగించడానికి UIDAI నుండి ఎవరు ప్రామాణీకరణ కోరారో తెలుస్తుంది.

ఇందుకోసం ముందుగా ఆధార్ కార్డ్ uidai.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, మై ఆధార్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
ఆధార్ సర్వీసెస్ ఆప్షన్ క్రింద, ఆధార్ Authentication హిస్టరీ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త విండో ఓపెన్ అవుతుంది. మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఇక్కడ ఎంటర్ చేయండి. సెక్యూరిటీ కోడ్‌ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఒకవేళ మీ ఆధార్ దుర్వినియోగం అవుతున్నట్లు మీరు భావిస్తే, మీరు వెంటనే UIDAI టోల్ ఫ్రీ నంబర్ – 1947ను సంప్రదించవచ్చు లేదా help@uidai.gov.in కి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇది కాకుండా, మీ ఆధార్‌లో ఏదైనా తప్పుడు సమాచారం నమోదు చేయబడితే, మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లి దాన్ని సరిదిద్దవచ్చు.