మామూలుగా రైలు ప్రయాణాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఎక్కడైనా లాంగ్ ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు ఆఫ్ లైన్ లోనో లేదంటే ఆన్లైన్ లోనో టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. రైలు టికెట్ బుక్ చేసుకోడానికి చాలా రకాల మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో టికెట్ల బుకింగ్, క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అయితే ముందస్తు రిజర్వేషన్ల కోసం మాత్రమే ఈ మార్గాలు ఉపయోగపడుతాయి. అయితే కేవలం అన్ రిజర్వుడ్ బోగీలు మాత్రమే ఉండే సబర్బన్, నాన్ సబర్బన్ రైళ్లలో టికెట్ బుకింగ్ కి అవకాశం గతంలో ఉండేది కాదు. కానీ 2014లో భారతీయ రైల్వే అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ యాప్‌ను ప్రవేశపెట్టింది.
ఈ యాప్ వినియోగదారులను సబర్బన్, నాన్ సబర్బన్ రైళ్లలో టికెట్ లను బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దీని ద్వారా 200 కి.మీ దాటిన నాన్-సబర్బన్ స్టేషన్ టికెట్ లను ప్రయాణ తేదీ కన్నా మూడు రోజులు ముందుగానే కొనుగోలు చేయవచ్చు. అలాగే 200 కి.మీ లోపు ఉండే సబర్బన్ టికెట్ లను ప్రయాణం రోజున బుక్ చేసుకోవచ్చు. అంతేకాక ఈ యూటీఎస్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్ కు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉపయోగించడాన్ని ప్రోత్సహించేందుకు సర్వీస్ చార్జీని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఈ యూటీఎస్ యాప్‌లో టికెట్ క్యాన్సిలేషన్ ఎలా చేసుకోవాలో అందుకు వీలవుతుందో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యూటీఎస్ యాప్ లో రెండు రకాలుగా టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పేపర్ లెస్, పేపర్ టికెట్. పేపర్‌లెస్ ఆప్షన్ లో మీరు ఆన్‌లైన్ లో టికెట్ ను కొనుగోలు చేయవచ్చు.
ప్రింటెడ్ కాపీ అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. మరోవైపు పేపర్ టికెట్ కోసం యూటీఎస్ యాప్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు చేసిన తర్వాత మీరు దానిని రైల్వే స్టేషన్ కౌంటర్ లేదా ఏటీవీఎం మెషీన్ లలో ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పేపర్ లెస్ టిక్కెట్ లు రద్దు చేయడానికి అనుమతి ఇవ్వరు. పేపర్ టికెట్ పద్ధతిలో మాత్రం రద్దుకు అవకాశం ఉంటుంది. కియోస్క్ లో టికెట్ ను ప్రింట్ చేయకపోతే మొబైల్ అప్లికేషన్ ద్వారానే టికెట్ రద్దు చేసుకోవచ్చట. ఒకవేళ టికెట్ ప్రింట్ చేస్తే.. ప్రింట్ అవుట్ తర్వాత ఒక గంట లోపు యూటీఎస్ కౌంటర్ లో మాత్రమే రద్దు చేయడానికి అనుమతి ఉంటుంది. అలాగే రద్దు సమయంలో ఎలాంటి నగదు వాపసు ఇవ్వరు. క్లర్కేజ్ ఛార్జీని మినహాయించిన తర్వాత వాపసు మొత్తం వినియోగదారు ఆర్ వాలెట్‌లో ఆటోమేటిక్‌గా టాప్ అప్ చేస్తారు.
ఒకవేళ యూటీఎస్ యాప్‌లో రద్దు చేసుకోవాలి అనుకుంటే అందుకోసం ముందుగా.. యూటీఎస్ యాప్‌లోకి వెళ్లి, మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అయ్యి . క్యాన్సిల్ బటన్ ను క్లిక్ చేయాలి. కొత్త మొబైల్ సైట్ ఓపెన్ అవుతుంది. ఇది రద్దు చేయడానికి అర్హత ఉన్న అన్ని టిక్కెట్‌లను చూపుతుంది. ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జీ రూ. 30. కాగా మీరు రూ. 30 కంటే తక్కువ విలువైన టికెట్ లను కొనుగోలు చేసినట్లయితే, అవి ఈ విండోలో కనిపించవు. మీరు ఈ విండోలో చూపిన క్యాన్సిల్ టికెట్ బటన్‌పై క్లిక్ చేయాలి.యాప్ మీ రద్దు నిర్ణయం గురించి నిర్ధారణ కోసం అడుగుతుంది. రద్దు ఛార్జీని తీసివేసిన తర్వాత రీఫండ్ మొత్తం చిన్న పాప్ అప్ బాక్స్‌లో కనిపిస్తుంది. తర్వాత ఓకే బటన్‌పై నొక్కాల్సి ఉంటుంది. కొత్త పాప్-అప్ సందేశం ఫ్లాష్ అవుతుంది. రద్దు రుసుమును తీసివేసిన తర్వాత మీరు ఎంత వాపసు పొందబోతున్నారో అది మీకు చూపుతుంది.