Site icon HashtagU Telugu

UTS App registration: UTS యాప్‌ ద్వారా సులువుగా రైల్వే జనరల్ టికెట్ బుక్ చేసుకోండిలా!

UTS App registration

New Web Story Copy 2023 06 07t203510.815

UTS App registration: రైల్వే జనరల్ టికెట్ తీసుకోవడం సమయం వృథా అనుకునేవారికోసం అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. సదరు యాప్స్ ఉంచి చాలా సులువుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. సమయం ఆదా అవడమే కాకుండా యాప్స్ ఆఫర్స్ ను కూడాప్రకటిస్తాయి . దీంతో చాలా మంది ప్రయాణికులు ఆన్లైన్ టికెటింగ్ కే మొగ్గు చూపుతున్నారు. భారతీయ రైల్వే UTS మొబైల్ యాప్‌ని ఉపయోగించడం ద్వారా సులభంగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు జనరల్ టికెట్‌తో పాటు ప్లాట్‌ఫారమ్ టికెట్ మరియు నెలవారీ టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు.

ముందుగా Google Play మరియు Apple iOS నుండి UTS యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్‌ ఓపెన్‌ చేశాక ఫోన్‌ నంబర్, పేరు, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేసుకుని వచ్చే ఓటీపీ ఆధారంగా ఖాతా రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ఆతర్వాత యాప్‌ తెరిచి ఫోన్‌ నంబరు, పాస్‌వర్డ్‌తో ఖాతాలోకి లాగిన్‌ అయితే సాధారణ బుకింగ్, క్విక్‌ బుకింగ్, ఫ్లాట్‌ఫాం టికెట్, సీజన్‌ టికెట్, క్యూఆర్‌ బుకింగ్, కేన్సల్‌ టికెట్‌ తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ఎక్కాల్సిన స్టేషన్, గమ్యస్థానం తదితర వివరాలు నమోదు చేసి టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. UTS యాప్ నిబంధనలు మరియు షరతులను చదవండి. ఆ తర్వాత రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేయండి. మీరు UPI, నెట్ బ్యాంకింగ్ మరియు డెబిట్ కార్డ్ ద్వారా రుసుము చెల్లించవచ్చు.

UTS మొబైల్ యాప్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు:
మీరు రైలులో ప్రయాణించడానికి మూడు గంటల ముందు వరకు UTS మొబైల్ యాప్‌లో అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు 3, 6 మరియు 12 నెలల పాటు నెలవారీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

Read More: Death and Technology: చనిపోయాకా.. 6 గంటలు గుండె, మెదడును యాక్టివ్ గా ఉంచే టెక్నాలజీ!!