UPI Payment: మీ స్మార్ట్ ఫోన్ పోయిందా.. అయితే మరి మీ యూపీఐ ఐడీల పరిస్థితి?

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి ఈ పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగ

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 04:30 PM IST

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి ఈ పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తూనే ఉన్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ల తోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. అలా ఒక పూట భోజనం లేకపోయినా ఉంటారేమో కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా ఫోన్ ని వినియోగించకుండా ఉండలేకపోతున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మన ఫోన్ దొంగలించడం లేదంటే పోగొట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే అలాంటప్పుడు ఇతరులకు మన ఫోన్ దొరికితే మన ఫోన్లో ఉండే గూగుల్ పే, ఫోన్ పే,పేటీఎం లాంటి యాప్ ల పరిస్థితి ఏంటి అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలగవచ్చు.

మరి ఫోన్‌ పోయిన వెంటనే యూపీఐ ఐడీలను ఎలా బ్లాక్‌ చేయాలి? అందుకోసం ఏం చేయాలి ఎటువంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం ముందుంగా పేటీఎమ్‌ హెల్ప్‌ లైన్‌నెంబర్‌ 01204456456కు కాల్ చేయాలి. అనంతరం మీ ఫోన్‌ నెంబర్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పోయిన మీ ఫోన్‌ నెంబర్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత లాగ్‌ అవుట్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం పేటీఎమ్‌ వెబ్‌ సైట్‌ లోకి వెళ్లి 24×7 హెల్ప్ ఆప్షన్‌ని సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత రిపోర్ట్‌ ఏ ఫ్రాడ్ లేదా మెసేజ్ అస్ ఆప్షన్‌ని సెలక్ట్‌ చేసుకోవాలి. చివరిగా పోలీస్‌ రిపోర్ట్‌తో సహా కొన్ని వివరాలను వివరించాలి. అన్ని వివరాలను తనిఖీ చేసిన తర్వాత పేటీఎమ్‌ మీ ఖాతాను తాత్కాలికంగా బ్లాక్‌ చేస్తుంది.

అలాగే ఫోన్ పే యుపిఐ ఐడి కోసం ముందుగా 02268727374 లేదా 08068727374కు కాల్ చేయాలి. అనంతరం యూపీఐ ఐడీ లింక్‌ చేసిన మొబైల్ నెంబర్‌ను ఫిర్యాదు చేయాలి. ఓటీపీ ఆప్షన్‌ అడిగిన్పుడు సిమ్‌ కార్డ్‌ అండ్‌ డివైజ్‌ లాస్ట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత వెంటనే కస్టమర్ కేర్‌కి కాల్‌ కనెక్ట్ అవుతుంది. అనంతరం కొన్ని అంశాలు అందించిన వెంటనే యూపీఐ ఐడీ బ్లాక్‌ అవుతుంది.

అలాగే గూగుల్ పే ఐడి కోసం ముందుగా 18004190157 నంబర్‌కు కాల్ చేయాలి. అనంతరం మీ యూపీఐ ఐడీ బ్లాక్‌ చేయాలనే విషయాన్ని తెలియజేయాలి.. అనంతరం ఆండ్రాయిడ్‌ యూజర్లు.. కంప్యూటర్‌ లేదా ఫోన్‌లో గూగుల్ ఫైండ్ మై ఫోన్ కి లాగిన్ చేయాలి. అనంతరం గూగుల్‌ పే డేటాను రిమోట్‌గా తొలగించాలి. దీని తర్వాత మీ గూగుల్ పే ఖాతా తాత్కాలికంగా బ్లాక్‌ అవుతుంది. ఒకవేళ ఐఓఎస్‌ యూజర్లు అయితే ఫైండ్ మై యాప్ ద్వారా డేటాను తొలగించడం ద్వారా గూగుల్‌ పే ఖాతాను బ్లాక్‌ చేయవచ్చు.