Private Video Leak: ఈ తప్పులు చేస్తే.. ఫోన్ నుంచి ప్రయివేటు వీడియోలు లీకైపోతాయ్!!

మొహాలీలోని ఒక ప్రయివేటు యూనివర్సిటీకి చెందిన విద్యార్థినుల వీడియోలు లీకైన వ్యవహారం దుమారం రేపుతోంది.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 07:15 AM IST

మొహాలీలోని ఒక ప్రయివేటు యూనివర్సిటీకి చెందిన విద్యార్థినుల వీడియోలు లీకైన వ్యవహారం దుమారం రేపుతోంది. ఈనేపథ్యంలో అందరి దృష్టి స్మార్ట్ ఫోన్ సెక్యూరిటీ పై పడింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లను లీకేజీల గండం వెంటాడుతోంది. ఫోన్ లోని MMS , ప్రయివేటు వీడియోలు లీకయ్యే ముప్పు ముసురు కుంటోంది. వాస్తవానికి ఫోన్ ను వాడే వ్యక్తుల నిర్లక్ష్యం, తప్పిదాల వల్లే వీటి లీకేజీకి దారులు తెరుచు కుంటున్నాయి. అటువంటి నిర్లక్ష్యాలు ఏమిటి? తప్పిదాలు ఏమిటి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

* వెబ్ సైట్ లో వీడియోల అప్ లోడ్

కక్ష సాధింపు చేయాలని భావించే వ్యక్తులు తాము టార్గెట్ గా ఎంచుకున్న వ్యక్తుల వీడియాలను కొన్ని వెబ్ సైట్లలో అప్ లోడ్ చేస్తుంటారు. ఆ వెబ్ సైట్ల నుంచి సోషల్ మీడియా లోకి వీడియో లీక్ అయ్యేలా చేస్తారు. సాధారణంగా లవర్ కు బ్రేకప్ చెప్పాక.. వాళ్ళ వీడియోలను ఇలా వెబ్ సైట్స్ ద్వారా లీక్ చేసిన ఘటనలు గతంలో ఎన్నో వెలుగు చూశాయి. అయితే ఇతరత్రా సాంకేతిక కారణాలు కూడా ఉండొచ్చు.

* థర్డ్ పార్టీ యాప్స్ తో జాగ్రత్త

మీరు ఇష్టం వచ్చినట్టు.. ఏది పడితే ఆ థర్డ్ పార్టీ యాప్ ను స్మార్ట్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోవద్దు. ఒకవేళ ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని భావిస్తే .. డౌన్ లోడ్ చేసుకునే క్రమంలో యాప్ మిమ్మల్ని అడుగుతున్న పర్మిషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లోని ఫైల్స్, వీడియోలు, ఫోటోల సెక్షన్ ను యాక్సెస్ చేసే పర్మిషన్స్ ఎట్టి పరిస్థితుల్లో యాప్స్ కు ఇవ్వొద్దు. ఒకవేళ ఆ పర్మిషన్స్ ఇస్తే.. థర్డ్ పార్టీ యాప్ నిర్వాహకులు మీ ఫోన్ లోకి దొంగతనంగా చొరబడి మీ సెన్సిటివ్ డేటాను దొంగిలిస్తారు.

* ఫోన్ అమ్మేటప్పుడు నిర్లక్ష్యం

స్మార్ట్ ఫోన్ ను ఇతరులకు అమ్మేటప్పుడు బీ అలర్ట్. మీ ఫోన్ లో ఉన్న మొత్తం సమాచారాన్ని, ఫోటోలు, వీడియోలు, మెసేజెస్ ను ఒక్కటి కూడా లేకుండా కొత్త ఫోన్ కు లేదా మెమోరీ కార్డుకు ట్రాన్స్ ఫర్ చేసుకోండి. ఆ తర్వాత వాటిని డిలీట్ చేసేయండి. అయితే అంతకుముందు మీ ఫోన్ మెమోరీ సెట్టింగ్స్ లో బ్యాకప్ ఆప్షన్ ఆన్ చేసి ఉంటే యమ డేంజర్. ఈ ఆప్షన్ ను ఆఫ్ చేశాక ఫోన్ లోని ఫైల్స్ ను డిలీట్ చేయాలి. ఒకవేళ అలా చేయకుంటే.. మన పాత ఫోన్ ను కొన్నవాళ్ళు బ్యాకప్ నుంచి ఫోటోలు, వీడియోలను రికవరీ చేసుకుంటారు. వాటిని దుర్వినియోగం చేసే ముప్పు కూడా ఉంటుంది.