Wi-Fi : మీ వైఫై.. ఎంత వరకు సేఫ్?

వైర్లెస్ మోసాలు పెరిగిపోతున్నాయి. మరి అలాంటి పరిస్థితులలో హోమ్ నెట్వర్క్ మన వైఫై భద్రతకు ఎంతో ప్రాధాన్యం ఉండాలి.

  • Written By:
  • Publish Date - June 28, 2023 / 10:00 PM IST

వైర్లెస్(Wireless) తో పనిచేసే డిజిటల్(Digital) పరికరాల వినియోగం చాలా ఎక్కువైపోయింది. కూర్చున్న దగ్గర నుంచి లేవకుండానే టీవీలు(TV), ఫ్యాన్(Fan) లు ఆన్- ఆఫ్ చేస్తున్నాం, వార్తలు, పాటలు వినేస్తున్నాం. మనుషులం అందరం ఒకరికి ఒకరం కనెక్ట్ అని ఉన్నమో లేదో ఆలోచించం గానీ ఇంట్లో అన్ని గ్యాడ్జెట్స్(Gadgets) వైఫైకి కనెక్ట్ అయి ఉన్నాయా లేదా అన్నది మాత్రం రోజుకి ఒక్కసారి అయినా చెక్ చేసుకుంటాం. ఇలాంటి సమయంలో వైర్లెస్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. మరి అలాంటి పరిస్థితులలో హోమ్ నెట్వర్క్ మన వైఫై భద్రతకు ఎంతో ప్రాధాన్యం ఉండాలి. అలాగని మీ వైఫై నెట్వర్క్ ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరేం టెక్ గురు అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని బేసిక్ జాగ్రత్తలు పాటిస్తే చాలు.

*వీటిలో ముందుగా చేయాల్సింది డిఫాల్ట్ నేమ్, పాస్వర్డ్ మార్చుకోవటం. సాధారణంగా వైర్లెస్ రూటర్ల కంపెనీలు ఇచ్చే డిఫాల్ట్ నేమ్ మీకు నచ్చినట్టుగా మార్చుకోండి. పాస్వర్డ్ కూడా వీలైనంత స్ట్రాంగ్ గా ఉండేలా అక్షరాలు, అంకెలు, సింబల్స్ తో కలిపి ఎంత డిజైన్ చేసుకుంటే మీకు హ్యాకర్ ల నుంచి అంత ప్రొటెక్టెడ్ గా ఉంటారు.

*అలాగే మీరు ఇంట్లో లేనప్పుడు, ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు మీ రూటర్ ను ఆఫ్ చేసేయండి.

*ఇక నెట్వర్క్ ఎన్క్రిప్షన్ ఎనేబుల్. చాలా రూటర్లలో ఇది డిఫాల్ట్ గా ఆఫ్ అయ్యి ఉంటుంది దీన్ని ఆన్ చేసుకుంటే షేర్ చేసుకున్న డేటా ఎన్క్రిప్ట్ అవుతుంది ఇలా నెట్వర్క్ భద్రతను కాపాడుకోవచ్చు.

*అలాగే మీ ఇంట్లో మీరు వైఫైని షేర్ చేసుకోవడం మంచిదే కానీ తెలియని వాళ్ళకి ఇంటికొచ్చి, కాసేపు ఉండి వెళ్ళిపోయే వారికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే చిక్కుల్లో పడ్డట్టే. ఇంటికి పనిచేయడానికి వచ్చే వారికో, దోస్తుల దోస్తులకో తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తే ఇంటి వైఫై కనెక్షన్ కంటే గెస్ట్ వైఫై నెట్వర్క్ ను సెట్ చేసుకొని ఇవ్వడం మంచిది.

*ఇక కంప్యూటర్లో వైరస్ ల వంటివి చొర పడకుండా ఫైర్ వాల్ అడ్డుకుంటుంది. సాధారణంగా వైర్లెస్ రూటర్లలో ఇన్బిల్ట్ గా ఫైర్ వాల్ ప్రొటెక్షన్ ఉంటుంది కానీ కొన్నిసార్లు ఇది ఆఫ్ అయి ఉండవచ్చు. అందువల్ల రూటర్లో ఫైర్ వాల్ ను ఆన్ చేసుకోవాలి. ఒకవేళ మీ రూటర్ లో ఫైర్ వాల్ లేకపోతే కంప్యూటర్లో ఫైర్ వాల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి.

*ఇతర సాఫ్ట్‌వేర్స్ మాదిరిగానే కొన్నిసార్లు రూటర్లో కూడా లోపాలు తలెత్తవచ్చు. కాబట్టి దానిని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు చాలు మీ వైఫై ని ఎంతో భద్రంగా ఉంచుతాయి. మీ వైఫైని హ్యాక్ చేయకుండా కాపాడతాయి.

 

Also Read : Moto G32: కేవలం రూ. 11 వేలకే అద్భుతమైన మోటో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?