ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ ని వినియోగిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్ ల తోనే గంటల కొద్దీ కాలక్షేపం చేస్తూ ఉంటారు. డేటా అయిపోయినప్పుడు లేదా చార్జింగ్ అయిపోయినప్పుడు మాత్రమే ఆ మొబైల్ ఫోన్లకు రెస్ట్ ఇస్తూ ఉంటారు. అంతగా మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా మొబైల్ ఫోన్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల త్వరగా చార్జింగ్ అయిపోతూ ఉంటుంది. ఇలా చార్జింగ్ అయిపోయినప్పుడు చార్జింగ్ పెట్టడం మళ్ళీ వెంటనే మొబైల్ ఫోన్ యూస్ చేయడం చేస్తూ ఉంటారు. ఇలా కొత్త స్మార్ట్ ఫోన్ కూడా కొద్ది రోజులకే స్మార్ట్ ఫోన్ గా మారిపోయి బ్యాటరీ త్వరగా అయిపోతూ ఉంటుంది.
100% చార్జింగ్ పెట్టిన కూడా అది కేవలం కొన్ని గంటలు మాత్రమే వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చాలామంది విసుగు చెందుతూ ఉంటారు. మరి నిజానికి మొబైల్ ఫోన్ ని రోజుకు ఎన్నిసార్లు చార్జింగ్ పెట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొంతమంది చార్జింగ్ పెట్టి 100% ఎక్కే వరకు ఉంటే మరి కొంతమంది కొద్దిగ చార్జింగ్ ఎక్కగానే ఫోన్ తీసేసి మళ్లీ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా పదే పదే మొబైల్ ఫోను ఛార్జింగ్ చేసి అలవాటు ఉన్నా, అలాగే ఫోన్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్న కూడా ఇక మీదట ఆ అలవాటు మానుకోవాలని చెబుతున్నారు. మొబైల్ ఫోన్‌ను రోజుకు రెండుసార్లు ఛార్జ్ చేయాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఫోన్ ను రోజులో ఎక్కువ సార్లు లేదా తరచుగా ఛార్జింగ్ చేయడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ పై ప్రభావం చూపుతుందట. దీనితో పాటు మీరు మీ ఫోన్ ను తరచుగా ఛార్జ్ చేస్తుంటే, తక్కువ సమయంలో మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందని, మీరు దానిని మళ్లీ ఛార్జ్ చేయవలసి ఉంటుందని మీరు భావిస్తారు. ఫోన్ లో 20 శాతం ఛార్జ్ మిగిలి ఉండగానే ఫోన్ ను ఛార్జ్ చేయాలి. అలాగే 80 శాతం ఛార్జింగ్ అయిన వెంటనే బయటకు తీయాలి. బ్యాటరీని పూర్తిగా డిశ్చార్జ్ చేయడాన్ని నివారించడం మంచిది. బ్యాటరీ స్థాయి 80 శాతం ఉన్నప్పుడు మాత్రమే ఛార్జర్ నుండి ఫోన్ ను అన్‌ప్లగ్ చేయాలి. మీ మొబైల్ ఫోన్ లో ఛార్జింగ్ 45% కంటే తక్కువగా ఉన్నప్పుడు మీరు చార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే 75% రాగానే మీ చార్జింగ్ తీసివేయవచ్చు. ఇలా 45 -75 నియమాన్ని పాటిస్తే మొబైల్ ఫోన్ ఎక్కువ కాలం వినియోగించవచ్చని చెబుతున్నారు. ఈ పద్ధతి ఫోన్ బ్యాటరీని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.