Sim Cards : ఇంతకీ ఒక వ్యక్తి సగటున ఎన్ని సిమ్ కార్డులను తీసుకోవచ్చు? తన పేరిట ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనే సమాచారాన్ని ఎలా తెలుసుకోవాలి? అనే దానిపై వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
We’re now on WhatsApp. Click to Join
కొంతమందికి దగ్గర రెండు సిమ్ కార్డులు ఉంటాయి. ఒకదాన్ని పూర్తిస్థాయిలో వాడుతుంటారు. ఇంకోదాన్ని అంతంత మాత్రంగా వాడుతుంటారు. ఎప్పుడో రెండు, మూడు నెలలకోసారి దాన్ని రీఛార్జ్ చేయిస్తారు. కొంతమంది దగ్గర నాలుగైదు సిమ్ కార్డులు కూడా ఉంటాయి. వాళ్లు కూడా యాక్టివ్‌గా వాడేది ఒకే నంబరు. మిగతావన్నీ వివిధ అవసరాల కోసం వాడి పక్కన పెడుతుంటారు. ఇలా చేసే వారికి ఇకపై చెక్ పెట్టే దిశగా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మార్గదర్శకాలను రెడీ చేస్తోంది. భారీగా సిమ్‌లు(Sim Cards) తీసుకున్న కొందరు.. వాటితో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇతరత్రా అసాంఘిక చర్యలకు తెగబడుతున్నారు. అందుకే ఇలాంటి వారికి అడ్డుకట్ట వేసే దిశగా త్వరలో ట్రాయ్ నుంచి నిర్ణయాలు వెలువడనున్నాయి. ఇప్పటికే సిమ్ కార్డ్ జారీ నిబంధనల్ని కేంద్ర టెలికాం విభాగం కఠినతరం చేసింది.ఈ నిబంధనల ప్రకారం.. దేశ ప్రజలు ఒక ఆధార్ కార్డుతో గరిష్ఠంగా 9 సిమ్‌కార్డులు పొందొచ్చు. అంతకుమించి సిమ్ కార్డులకు అప్లై చేసుకుంటే రెజెక్షన్ ఎదురవుతుంది. 9కి మించి సిమ్ కార్డుల కోసం అప్లై చేస్తే బల్క్ సిమ్ కార్డ్స్ కేటగిరీలోకి పేరు చేరుతుంది. అలాంటి వారి అప్లికేషన్ వెంటనే తిరస్కరణకు గురవుతుంది.
Also Read : Indias Largest IPO : దేశంలోనే అతిపెద్ద ఐపీఓ వస్తోంది.. ఏ కంపెనీదో తెలుసా ?
సిమ్ కార్డుల గురించి తెలుసుకోవాలా ?
- మీ ఆధార్ నంబరు మీద ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయనేది తెలుసుకోవడం ఈజీ.
- దీని కోసం మీరు టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) అనే ప్లాట్‌ఫామ్‌ను వాడాలి.
- తొలుత sancharsaathi వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. ఈ సైటులో ‘‘Citizen Centric Services’’ కింద కనిపించే ఆప్షన్లలో ‘‘Know your mobile connections’’ పై క్లిక్ చేయాలి. తదుపరిగా ఫోన్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయగానే మీ ఫోనుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఆ యూజర్ పేరిట ఉన్న ఫోన్ నంబర్ల లిస్టు కనిపిస్తుంది. అందులో ఉన్న ఫోన్ నంబర్లు మీవేనా? కాదా? చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా నంబరు మీది కాకుంటే.. అక్కడే దాన్ని బ్లాక్ చేయండి.
ఫోన్ నంబరుపైనా ఛార్జీ
సిమ్ కార్డులు వినియోగిస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ఇకపై మొబైల్ నెంబర్ పైనా ఛార్జీ వసూలు చేసేందుకు ట్రాయ్ కొత్త సిఫార్సులు సిద్ధం చేస్తోంది. దీని ప్రకారం ఫోన్ నంబర్ కు, ల్యాండ్ లైన్ నంబర్ కు చార్జీలు వసూలు చేస్తారు. సహజ వనరుల్లానే ఫోన్ నంబర్ కూడా చాలా విలువైనదని ట్రాయ్ భావిస్తుండటమే ఈ ప్రతిపాదనకు కారణం. ఫోన్ నంబర్లు అపరిమితం కాదు కాబట్టి వాటి దుర్వినియోగానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నారు.