Aadhaar Card: ఆధార్ లో ఫోటో మార్చాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది కీలకంగా మారింది. గవర్నమెంట్ ప్రైవేట్ ఇలా ప్రతి ఒక్క దానికి కూడా ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి.

  • Written By:
  • Updated On - April 28, 2023 / 04:54 PM IST

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది కీలకంగా మారింది. గవర్నమెంట్ ప్రైవేట్ ఇలా ప్రతి ఒక్క దానికి కూడా ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. అయితే అన్నింటికీ మూలం కాబట్టి ఆధార్ కార్డులో ఎటువంటి సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరించుకోవడం మంచిది. ఆధార్ లో ఉండేటువంటి సమస్యలలో ఫోటో సమస్య కూడా ఒకటి. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆదార్ కార్డులో ఫోటోని మార్చుకోవడానికి కొన్ని రకాల మార్గాలు ఉన్నాయి.

కేవలం ఫోటో మాత్రమే కాకుండా పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ వంటి వాటిని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. బయోమెట్రిక్ మార్చుకోవడానికి ఆధార్ సెంట‌ర్‌కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇతర వివరాలను ఆన్‌లైన్‌‌ ద్వారా మార్చుకోవచ్చు. మరి ఆధార్ కార్డులో ఫోటోని ఏ విధంగా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్ళాలి. https://appointments.uidai.gov.in/ వెబ్ సైట్ ద్వారా కూడా మీకు సమీపంలో ఉన్న ఆధార్ సెంటర్ గురించి తెలుసుకోవచ్చు. ఆధార్ సెంటర్ వెళ్ళిన తరువాత అక్కడ దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఫిల్ చేసే అందించాలి.

అప్పుడు వారు మీ బయోమెట్రిక్ తీసుకుంటారు. ఆధార్ కార్డులో మీ ఫోటో మార్చాలనుకుంటే ఆపరేటర్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటాడు. కావలసిన అన్నీ తీసుకున్న తరువాత అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ను అందిస్తారు. ఈ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అప్డేట్ రిక్వెస్ట్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు అప్డేట్ అయిన తరువాత డిజిటల్ కాఫీని అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.