Honor X9b 5G: మార్కెట్లోకి రాబోతున్న హానర్ 5జీ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ హానర్‌ మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. బడ్

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 12:00 PM IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ హానర్‌ మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. బడ్జెట్ ధరలో మంచి మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పటికే పదుల సంఖ్యలో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన హానర్ సంస్థ తాజాగా మరో సరి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. హానర్‌ చాయిస్‌ ఎక్స్‌5, హానర్‌ చాయిస్‌ వాచ్‌ తో పాటు హానర్‌ ఎక్స్‌9బీ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ను ఒకేసారి లాంచ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

అందుకు ఫిబ్రవరి 15న ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. మరి త్వరలో విడుదల కాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్ల విషయానికొస్తే. ఇది స్నాప్‌డ్రాగన్‌ 6జెన్‌ 1ఎస్‌ఓసీ ప్రాసెసర్‌, 5,800ఎంఏహెచ్‌ బ్యాటరీతో గ్లోబల్‌ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ 5,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ బ్యాకప్‌ తో 18 గంటల కాలింగ్ సమయం, గరిష్టంగా 12 గంటల గేమింగ్ సమయం, 19 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని సింగిల్‌ ఛార్జ్‌పై అందిస్తుంది. దీనిని మూడు రోజుల పాటు నిరంతరాయ ఉపయోగించుకోవచ్చట. ఇది 1,000 ఛార్జ్ సైకిల్స్ తర్వాత కూడా దాని సామర్థ్యం లో 80 శాతం నిలుపుకుంటుందని కంపెనీ వెల్లడించింది.

కాగా దీనికి గోల్డ్ బ్యాటరీ లేబుల్‌ను ఇచ్చింది. హానర్‌ ఎక్స్‌9బీ 5జీ ఆండ్రాయిడ్ 13-ఆధారిత మ్యాజిక్‌ ఓఎస్‌ 7.2 ఆధారంగా పనిచేస్తుంది. అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్‌లను అందిస్తోంది. ఇది క్వాల్కామ్‌ స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 1 ఎస్‌ఓసీ పాటు 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ఆన్‌బోర్డ్ మెమరీని 20 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ మనకు మిడ్ నైట్ బ్లాక్ సన్రైజ్ ఆరెంజ్ వంటి కలర్స్ లో లభించునుంది. ఇది హై ఎండ్ వాచీల నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. కెమెరా మాడ్యూల్ డ్యూయల్-రింగ్ డిజైన్‌ను కలిగి ఉంది. హానర్‌ ఎక్స్‌9బీ 5జీ ఫిబ్రవరి 15న లాంచ్‌ అవుతోంది. హానర్ ఛాయిస్ ఇయర్‌బడ్స్ ఎక్స్‌5, హానర్ ఛాయిస్ వాచ్‌లు కూడా అదే రోజున మన దేశంలో అందుబాటులోకి వస్తాయి.