Site icon HashtagU Telugu

Honor 90: మార్కెట్ లోకి మరో హానర్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?

Honor 90

Honor 90

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం హానర్ ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అద్భుతమైన ఫీచర్లతో అతి తక్కువ ధరకే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన హానర్ సంస్థ భారత మార్కెట్లోకి మరో సరి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. హానర్‌ 90 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌ త్వరలోనే భారత్‌లో లాంచ్‌ చేయనున్నారు. ఇకపోతే త్వరలోనే లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 1200 x 2664 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కూడిన 6.7 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ కర్డ్వ్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

120Hz రిఫ్రెష్ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌ MagicOS 7. 1 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో నడుస్తుంది. కెమెరాకు అత్యధిక ప్రాధానత్య ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ సెటప్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. ఇందులో 200 ఎంపీ12 ఎంపీ 2 ఎంపీ కెమెరాలను అందించారు. అలాగే 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. కాగా బ్యాటరీ విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 66 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏఎచ్‌ బ్యాటరీని కూడా అందించారు.

యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ సపోర్ట్ చేస్తుంది. కాగా ఈ ఫోన్ సెప్టెంబర్ మధ్యలో ఇండియాలో లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ధర విషయానికొస్తే.. ఈ ఫోన్‌ టాప్‌ వేరియంట్ ధర రూ. 45,000గా ఉండొచ్చని తెలుస్తోంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.