Site icon HashtagU Telugu

Honor 90 Price Drop : హానర్ స్మార్ట్ ఫోన్ పై భారీగా తగ్గింపు.. ధర ఫీచర్ ఇవే?

Mixcollage 16 Jan 2024 01 46 Pm 9459

Mixcollage 16 Jan 2024 01 46 Pm 9459

ప్రస్తుతం ఆన్ లైన్ స్టోర్ లలో సంక్రాంతి రిపబ్లిక్ సేల్స్ నడుస్తున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని ప్రోడక్ట్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తున్నాయి. ఇక ఆన్లైన్ స్టోర్స్ లో ఒకటైన అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కొనసాగుతోంది. వివిధ డివైజ్‌లపై అద్భుతమైన డీల్స్, అనేక ఆఫర్‌లు ఉన్నాయి. అమెజాన్ సేల్ సమయంలో భారీ తగ్గింపుతో విక్రయించే స్మార్ట్‌ఫోన్ లలో హానర్ 90 సిరీస్ ఒకటి. ఈ ఫోన్ ధర కేవలం రూ. 26,749 మాత్రమే. లాంచ్ సమయంలో రూ. 37,999 ప్రారంభ ధరతో వచ్చింది. గత కొన్ని నెలలుగా హానర్ 90పై వివిధ ఆఫర్లు, తగ్గింపులు ఉన్నాయి. ప్రస్తుతం హానర్ 90 ఫోన్ టాప్-ఎండ్ 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై మాత్రమే ఉంది.

హానర్ ఫోన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999 వద్ద అందుబాటులో ఉంది. కానీ, అమెజాన్‌లో హానర్ 90 ఫోన్ రూ. 26,749కి అందుబాటులో ఉంది. హానర్ 90 టాప్-ఎండ్ 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో రూ. 30,999 వద్ద లిస్టు అయింది. ఇప్పటికే అసలు ప్రారంభ ధర కన్నా రూ. 9వేలు తక్కువగా ఉంది. అయితే, అమెజాన్ రూ. 2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూపన్‌ను అందిస్తోంది. ధరను రూ. 28,999కి తగ్గించింది. మీరు ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్‌ని కలిగి ఉంటే.. మీరు రూ. 2,250 అదనపు తగ్గింపును పొందవచ్చు. హానర్ 90 ఫోన్ ప్రభావవంతమైన ధరను రూ. 26,749కి పొందవచ్చు. కేవలం రూ. 13,250కు భారీ తగ్గింపు పొందవచ్చు.

కాగా ఈ హానర్ 90 ఫోన్ కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. బట్టరీ-స్మూత్ స్క్రోలింగ్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 3840 హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. ఎస్23 అల్ట్రా, ఐఫోన్ 15 ప్రో 240హెచ్‌జెడ్, 480హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్‌ను కలిగి ఉన్నాయి. 200ఎంపీ కెమెరా లైఫ్ కూడా పొందవచ్చు. హానర్ 90 మోడల్ 200ఎంపీ ప్రైమరీ బ్యాక్ కెమెరా పగటిపూట పంచ్‌ను అందిస్తుంది. కలర్-ట్యూనింగ్, వైట్ బ్యాలెన్స్ వివరాలు చాలా బాగుంది. వీడియో టైమ్ ఈఐఎస్ 4కె ఫుటేజ్ కలిగి ఉంది. స్పాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. హానర్ 90 అత్యంత వేగవంతమైనది కాకపోవచ్చు. ఈ ఫోన్ చాలా వేగంగా ఉంటుంది. మల్టీ యాప్‌ల మధ్య బీజీఎంఐ సెషన్‌ల మధ్య సాధారణ టాస్క్‌లను హ్యాండిల్ చేయవచ్చు. హానర్ 90 పెద్ద ఫోన్. అది అలా అనిపించదు. 6.7-అంగుళాల డిస్‌ప్లే ఉన్నప్పటికీ హానర్ 90 స్లిమ్‌గా ఉంది. చేతికి చాలా తేలికగా అనిపిస్తుంది. క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే కారణంగా డిస్‌ప్లే చుట్టూ కలిగి ఉంది. హానర్ 90 వెనుక భాగంలో గ్రిప్పీ గ్రీన్ గ్లాస్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది.

Exit mobile version