Site icon HashtagU Telugu

Whatsapp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. మేటా ఏఐ లో మరో సరికొత్త ఫీచర్?

Meta Ai

Meta Ai

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి. ఈ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఇకపోతే వాట్సాప్ సంస్థ ఇటీవల మేటా ఏఐ ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు మేటా ఏఐ హిందీలో కూడా వచ్చేసింది. దాంతో మేటా ఏఐ సర్వీస్ మరో ఏడు దేశాలకు విస్తరించింది. మేటా ఏఐ అర్జెంటీనా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, మెక్సికో, పెరూ, కామెరూన్‌ వంటి దేశాలకు చేరుకుంది. దీంతో 22 దేశాల్లో మేటా ఏఐ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ , ఇంస్టాగ్రామ్ , మెసెంజర్ , ఫేసుబుక్ లతో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌ లలో మేటా ఏఐ తో ఇప్పుడు హిందీలో చాట్ చేయవచ్చు. ఈ అనుభవాన్ని మెరుగుపరచడానికి, కొత్త ఫీచర్‌లను చేర్చడానికి ప్రతి రెండు వారాలకు మేటా ఏఐ అప్‌డేట్ చేయబడుతుందని మేటా తెలిపింది.
యుఎస్‌లో మెటా ఇమాజిన్ మీ ని కూడా పరిచయం చేసింది.

దీని ద్వారా ఏఐ రూపంలో మీ స్వంత లుక్ రూపొందించడానికి ఏఐ మీకు ఉపయోగపడుతుంది. కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ఫోటోస్ ఎడిట్ చేయడానికి ఎడిట్ విత్ ఏఐ ఫీచర్ కూడా వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.