Hero Eddy Electric Scooter: మార్కెట్ లోకి హీరో ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ హీరో ఎలక్ట్రానిక్ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ద్విచక్ర వాహనాలను విడుదల చేసిన విషయం

  • Written By:
  • Publish Date - March 9, 2023 / 07:00 AM IST

ప్రముఖ హీరో ఎలక్ట్రానిక్ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ద్విచక్ర వాహనాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. బైక్స్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ లను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల విడుదల చేసిన హీరో ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ ని ఫుల్ చార్జ్ చేయడానికి 4 నుంచి 5గంటల సమయం పడుతుంది.

ఈ స్కూటర్ బ్యాటరీ కెపాసిటీ 51.2Vగా ఉంది. ఈ స్కూటర్ బ్యాటరీ రేటింగ్ 30Ah‌గా ఉంది. ఈ స్కూటర్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. అందువల్ల ఈ స్కూటర్ కి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు. అలాగే ఈ స్కూటర్‌కి స్టైలిష్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది..దీనికి డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. అలాగే డిజిటల్ ట్రిప్ మీటర్ ఉంది. ఈ స్కూటర్‌ ఎక్కడున్నా ఈజీగా కనుక్కోవచ్చు. ఇందుకోసం ఫైండ్ మై బైక్ అనే ఆప్షన్ కూడా ఉంది. మైబైల్‌లో కంపెనీ యాప్ ద్వారా చెక్ చెయ్యవచ్చు. పార్కింగ్ లాట్‌లో బండి ఉన్నచోటి నుంచి హార్న్, ఫ్లాషర్ వస్తుంది. ఈ స్కూటర్‌కి ఎలక్ట్రిక్ ఈ లాక్ కూడా ఉంది.

బ్లూటూత్ ద్వారా దీన్ని లాక్ చెయ్యవచ్చు, అన్‌లాక్ చెయ్యవచ్చు. ఈ స్కూటర్‌కి LED హెడ్‌లైట్స్, టైల్‌లైట్స్ ఉన్నాయి. అలాగే కుషన్‌తో కూడిన బ్యాక్‌రెస్ట్ ఉంది. అంతేకాకుండా ఈ స్కూటర్‌కి రివర్స్ మోడ్ కూడా ఉంది. దీని ద్వారా టైట్ పార్కి్ంగ్ వంటి సమయంలో బైక్‌ని ఈజీగా వెనక్కి నడిపేసుకునే వీలు ఉంటుంది. అలాగే ఈ స్కూటర్‌కి USB పోర్ట్ ఉంది. అందువల్ల ఈజీగా ఛార్జింగ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో దీని ధరను రూ.72,000గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని బుక్ చేసుకున్న 60 రోజుల తర్వాత దీన్ని ఎంపిక చేసిన డీలర్‌షిప్ నుంచి డెలీవరీని చేస్తామని కంపెనీ తెలిపింది.