Site icon HashtagU Telugu

Foldable Motorcycle: మార్కెట్లోకి బుల్లి ఎలక్ట్రిక్ స్కూటర్.. మడత పెట్టి కారు డిక్కీలో పెట్టేయవచ్చు?

Foldable Motorcycle

Foldable Motorcycle

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో నిత్యం మార్కెట్ లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ బైక్లు విడుదల అవుతూనే ఉన్నాయి. ఒక దాన్ని మించి మరొకటి స్కూటర్లు మార్కెట్ లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు మనం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లు చూసి ఉంటాం. కానీ మీరు ఎప్పుడు అయినా ఫోల్డబుల్ బైక్స్ గురించి ఎప్పుడైన విన్నారా? ఫోల్డబుల్ బైకేంటా అనుకుంటున్నారా! మీరు విన్నది నిజమే.. ఎప్పుడో 1981లో హోండా నుంచి ఓ ఫోల్డబుల్ బైక్ కారు డిక్కీలో పట్టేంత చిన్నదిగా తీసుకొచ్చారు. దాని పేరే మోటోకాంపో.

అయితే కొన్ని కారణాలు ప్రతికూలతల కారణంగా ఆ బైక్ ఉత్పత్తిని 1983 లోనే నిలిపివేశారు. అయితే ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో చైనీస్ మోటార్ సైకిల్ తయారీదారైన ఫెలో ఓ కొత్త ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆవిష్కరించింది. ఫెలో టూ ఎం వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరిట దీనిని టోక్యో మోటార్ షో లో ప్రదర్శించింది. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉండబోతోంది అన్న విషయానికొస్తే.. చిన్న సైజ్ లో ఉండే ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ బైక్ ఇది. దీని బరువు 37 కేజీలు మాత్రమే. దీనిలో 1000 వాట్స్ పీక్ రేటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. 48V, 20Ah బ్యాటరీ ఒక kWh సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించగలుతుంది.

అయితే వేగంగా ప్రయాణించడానికి మాత్రం అనుకూలంగా ఉండదు. సిటీ పరిధిలో కేవలం 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో మాత్రమే ఈ స్కూటర్ ప్రయాణించగలుతుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని మరో ఆసక్తికర ఫీచర్ ఏంటంటే వీ2ఎల్. దాని ద్వారా మీ ఇంట్లోని వస్తువులు ఈ బైక్ లోని బ్యాటరీ ద్వారా ఆన్ చేసుకొని వివనియోగించుకోవచ్చు. అంటే ఇన్వెర్టర్ లాగా వినియోగించుకోవచ్చు. దాని బ్యాటరీలు అందుకు సహకరిస్తాయి. ఇకపోతే ఈ ఎం వన్ స్కూటర్ ప్రస్తుతం చైనా తో పాటు జపాన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. నాలుగో త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర 2,900 అమెరికన్ డాలర్లు ఉంటుంది. అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 2,38,710 ఉండే అవకాశం ఉంది.

Exit mobile version