WhatsApp Feature : వాట్సాప్ మెసేజ్‌లను షెడ్యూల్ చేసే ఫీచర్ ఇదిగో

WhatsApp Feature : వాట్సాప్‌లో ఇక మరో సూపర్ ఫీచర్‌ను వాడుకోవచ్చు.  

  • Written By:
  • Publish Date - December 1, 2023 / 08:15 AM IST

WhatsApp Feature : వాట్సాప్‌లో ఇక మరో సూపర్ ఫీచర్‌ను వాడుకోవచ్చు.  మీరు పంపాలనుకునే మెసేజ్‌ను షెడ్యూల్ చేసి పెట్టే ఆప్షన్‌‌ను అందించడమే ఆ కొత్త ఫీచర్ ప్రత్యేకత. అయితే ఈ ఫీచర్‌ వాట్సాప్‌లో ఆటోమేటిక్‌గా లభించదు. ఇది ఒక థర్డ్ పార్టీ ఫీచర్. దీని ద్వారా మీరు అనుకున్న సమయానికి.. మీరు పంపాలనుకున్న వ్యక్తి కోసం.. ముందుగానే మెసేజ్‌ను షెడ్యూల్ చేసి పెట్టొచ్చు. ఆ సమయం రాగానే మెసేజ్ నేరుగా సెండ్ అవుతుంది. ఈ థర్డ్ పార్టీ ఫీచర్‌ను వాట్సాప్‌లోకి ఎలా తెచ్చుకోవాలి ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

కొత్త ఫీచర్ పొందండి ఇలా.. 

  • ‘స్కెడిట్’ (SKEDit) అనే థర్డ్ పార్టీ యాప్  గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.
  • ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే.. మీరు వాట్సాప్ మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు.
  • SKEDit యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాక.. మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి సైన్ఇన్‌ చేయండి.
  • అందులో మీ పేరు, ఈమెయిల్, పాస్‌వర్డ్‌‌లను ఎంటర్ చేసి అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి.
  • ఆ తర్వాత మీ ఈమెయిల్‌ ఐడీకి వెరిఫికేషన్‌ లింక్ వస్తుంది.
  • మీరు వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత వాట్సాప్‌పై క్లిక్‌ చేసి స్కెడిట్ యాప్‌కు అవసరైన అనుమతులను మంజూరు చేయండి.
  • ఆ తర్వాత మెసేజ్‌లను షెడ్యూల్ చేసే ఫీచర్ మీ వాట్సాప్‌లో అందుబాటులోకి వస్తుంది.
  • షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను పంపే ముందు.. ఒకవేళ మరోసారి మీ అనుమతి ఇవ్వాలని భావిస్తే అలాంటి ఆప్షన్‌ను కూడా ఇక్కడ ఎంచుకోవచ్చు. దీన్ని ఎంపిక చేస్తే.. షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను సెండ్ చెయ్యడానికి ముందు మీ పర్మిషన్ అడుగుతుంది. దాన్ని ఓకే చేయగానే మెసేజ్(WhatsApp Feature) వెళ్లిపోతుంది.

Also Read: Kashi Vishwanath Jyotirlinga Temple : కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం పూర్తి వివరాలు..