Site icon HashtagU Telugu

WhatsApp tips and tricks: వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. వాట్సాప్ లో ఏకంగా 70 భాషలు?

Whatsapp Tips And Tricks

Whatsapp Tips And Tricks

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. వాట్సాప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది వాట్సాప్ సంస్థ. ఇది ఇలా ఉంటే వినియోగదారుల కోసం తాజాగా వాట్సాప్ సంస్థ మరో సరికొత్త ఫీచర్ ని తీసుకు వచ్చింది. ఈ ఫీచర్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇకపోతే తాజాగా వాట్సాప్ సంస్థ తీసుకువచ్చిన ఆ కొత్త ఫీచర్ ఏంటి అన్న విషయానికి వస్తే.. వాట్సాప్ లో ఇన్ బిల్ట్ గానే ఈ లాంగ్వేజీ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

ఆండ్రాయిడ్ యూజర్ లకు అయితే 70 భాషలు, ఐఓఎస్ యూజర్లకైతే 40 భాషలను వాట్సాప్ లో పొందవచ్చు. ఫలితంగా ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తితోనైనా సులభంగా మెసేజ్ చేయడానికి మన భావ వ్యక్తీకరణ చేయడానికి ఈ ఫీచర్ మనకు సహాయపడుతుంది. కాగా ప్రస్తుతం వాట్సాప్ లో పదుల సంఖ్యలో భాషా ఎంపికలు ఉన్నప్పటికీ మనం కేవలం రెండు లేదా మూడు భాషలను మాత్రమే ఉపయోగిస్తున్నాం. వాటిల్లో ఇంగ్లిష్, తెలుగు, హిందీ వంటివి మాత్రమే ఉంటున్నాయి. అయితే యాప్ నుంచి డైరెక్ట్ గా ఇతర భాషా మాట్లాడే వారితో మనం వారి భాషలోనే మాట్లాడవచ్చు. మనకు వారి భాష రాకపోయినా మనం ఎంచక్కా మెసేజ్ చేయవచ్చు.

ఇందుకోసం మీకు కావాల్సిందల్లా వాట్సాప్ లో ఈ భాషా ఎంపికలు ఎలా చేసుకోవాలి అన్న విషయంపై అవగాహన మాత్రమే. అందుకోసం మీరు మెసేజ్ పంపాలి అనుకుంటున్న వ్యక్తి కాంటాక్ట్ పై క్లిక్ చేసి చాట్ విండోను ఓపెన్ చేయాలి. చాట్ బాక్సులో మీకు వచ్చిన భాషలో మెసేజ్ ని టైప్ చేయండి. మొత్తం మెసేజ్ టైప్ చేయడం అయిపోగానే దానిని మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. వెంటనే మీకు ఓ పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది. ఆ పాప్ అప్ విండోలో ట్రాన్స్ లేటింగ్ అని ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిని ఎంపిక చేసుకొని, ఏ భాషాలోకి ట్రాన్స్ లేట్ కావాలో మీకు కనిపిస్తున్న లిస్ట్ నుంచి దానిని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వెంటనే ఆ భాషలోనికి మీ మెసేజ్ మారిపోతుంది. ఆ తర్వాత ఓకే బటన్ పై క్లిక్ చేస్తే మీకు పంపాలనుకున్న వ్యక్తికి వారి భాషలోనే మెసేజ్ వెళ్లిపోతుంది.

Exit mobile version