Mobile Numbers-Aadhaar : ఒకరి ఆధార్ కార్డుపై మరొకరు సిమ్ కార్డులు తీసుకొని నేరాలకు పాల్పడితే చిక్కులు వస్తాయి. ఈ తరహా సైబర్ నేరాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి.. మన పేరు మీద మనకు తెలియకుండానే ఎవరైనా ఫోన్ నంబర్ తీసుకుని వాడితే ఆ నంబర్ ను బ్లాక్ చేసుకునే వెసులుబాటును కేంద్ర టెలికాం శాఖ కల్పించింది. ఒక ఆధార్ కార్డుతో గరిష్టంగా 9 సిమ్ కార్డులను మాత్రమే తీసుకునేలా అనుమతించింది. ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ సిమ్ కార్డులు అవసరం అనుకుంటే రీ వెరిఫికేషన్ ను తప్పనిసరి చేసింది. ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునేలా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం ఒక వెబ్ సైట్‌ను రూపొందించింది. దానిపేరే “tafcop”. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ల వివరాలను(Mobile Numbers-Aadhaar) తెలుసుకోవచ్చు.
Also read : BRS MLAs: అసెంబ్లీ నుంచి శ్రీనివాస్ గౌడ్ అవుట్?
ఆధార్ తో లింక్ అయిన నంబర్ల చిట్టా తెలుసుకోవడం ఇలా..
- తొలుత https://tafcop.sancharsaathi.gov.in వెబ్ సైట్ లో లాగిన్ కావాలి.
- అందులో బ్లాక్ యువర్ లాస్ట్/ స్టోలెన్ మొబైల్, నౌ యువర్ మొబైల్ కనెక్షన్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి.
- రెండో ట్యాబ్ పై క్లిక్ చేస్తే వినియోగదారుడి 10 అంకెల మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలని సూచిస్తుంది.
- ఆ తర్వాత అక్కడ ఉన్న Captcha వాలీడేట్ చేస్తే.. మీ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఇక మీ పేరుపై ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయో.. అక్కడ దర్శనమిస్తాయి.
- తద్వారా మీరు వాడని నెంబర్స్ బ్లాక్ చేసుకోవచ్చు.
- ఒకవేళ మీరు సిమ్‌కార్డు పోగొట్టుకున్నా.. బ్లాక్ చేయాలని చూసినా.. వాడని సిమ్ కార్డులు ఉన్నా ఇలా ఈజీగా ఇంటి దగ్గర నుంచే బ్లాక్ చేయవచ్చు.
Also read : 17 Sets Of Twins : 17 జతల ట్విన్స్.. ఒకే స్కూల్ లో అడ్మిషన్.. ఫోటో వైరల్