Aadhaar Card: ఆధార్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. సేఫ్ గా ఉంచేందుకు మాస్క్డ్ ఆధార్ ఫీచర్!

భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలకు ఇలా ఏ దానికి అయినా సరే ఆధార్ కార్డు ఉండా

  • Written By:
  • Publish Date - January 5, 2024 / 08:49 PM IST

భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలకు ఇలా ఏ దానికి అయినా సరే ఆధార్ కార్డు ఉండాల్సిందే. అలా ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. అయితే అటువంటి ఆధార్ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా మన ఆధార్ నెంబర్ ఇతరులకు ఇవ్వడం లాంటిది అసలు చేయకూడదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొందరు మోసగాళ్లు ఆధార్ నెంబర్ల ద్వారా అక్రమ మార్గంలో ప్రయోజనాలను పొందుతున్నారు. అలా ఇటీవల కాలంలో ఆధార్ మోసాలు పెరిగిపోయాయి. బ్యాంక్, మొబైల్ నెంబర్, పాన్ కార్డ్,ఓటర్ కార్డు ఇలా ప్రతి ఒక్కదానికి ఆధార్ కార్డు అనుసంధానం అయ్యి ఉంటుంది కాబట్టి మన ఆధార్ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవడం తప్పనిసరి.

అయితే ఈ మధ్యకాలంలో ఇలా ఆధార్ మోసాలు పెరిగిపోతుండడంతో ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మాస్క్డ్ ఆధార్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. UIDAI ప్రతి భారతీయుడికి ఆధార్‌ను జారీ చేస్తుంది. ఇది 12 అంకెల యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. దీంట్లో వ్యక్తి బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటా ఉంటుంది. అయితే మాస్క్డ్ ఆధార్ అనేది వ్యక్తుల గోప్యతను మెరుగుపర్చుతుంది. ఆధార్ సమాచారం బహిర్గతం కాకుండా కాపాడుతుంది. ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటి అది ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయానికి వస్తే.. మాస్క్డ్ ఆధార్‌లో వ్యక్తి ఆధార్ నంబర్‌ లో కొన్ని అంకెలు మాస్క్ లేదా హిడెన్ అయి ఉంటాయి.

అయితే వ్యక్తి పేరు, ఫోటోగ్రాఫ్, QR కోడ్ వంటి ముఖ్యమైన డెమోగ్రాఫిక్ వివరాలు మాత్రం బహిర్గతంగా ఉంటాయి. వ్యక్తుల ప్రైవసీని కాపాడటానికి యూఐడీఏఐ మాస్క్డ్ ఆధార్‌ సర్వీస్‌ లాంచ్ చేసింది. దీంట్లో 12 అంకెల ఆధార్‌లో మొదటి 8 అంకెలు X తో కవర్ అయి ఉంటాయి. దీంతో ఆధార్ నంబర్ దుర్వినియోగమయ్యే అవకాశం ఉండదు. ముందుగా యూఐడీఏఐ అధికారిక పోర్టల్ https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి మై ఆధార్ సెక్షన్‌కు వెళ్లి డౌన్‌లోడ్ ఆధార్ ఆప్షనను సెలక్ట్ చేయాలి. దీంతో ఆధార్ డౌన్‌లోడ్ పేజీ స్క్రీన్‌ పై కనిపిస్తుంది. ఇక్కడ మీ పూర్తి పేరు, పిన్ కోడ్, సెక్యూరిటీ కోడ్ వంటి అవసరమైన వివరాలతో పాటు 12-అంకెల ఆధార్ నంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడీ ని ఎంటర్ చేయాలి. ఆ తరువాత సెలక్ట్ యూవర్ ప్రిఫరెన్స్ అనే సెక్షన్‌లో మాస్క్డ్ ఆధార్ సెలక్ట్ చేయాలి.

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్‌ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తిచేయాలి. అనంతరం మాస్క్‌డ్ ఆధార్‌ను PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది పాస్‌వర్డ్‌ ప్రొటెక్షన్‌తో ఉంటుంది. మాస్క్డ్ ఆధార్‌తో అనేక ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తుల గోప్యతకు ఇది రక్షణలా పనిచేస్తుంది. ఆధార్ నంబర్ దుర్వినియోగం కాకుండా నిరోధించవచ్చు. ఏదైనా అవసరాల కోసం ఆధార్ నంబర్‌ను ఎవరితోనైనా షేర్ చేయాల్సి వస్తే, పూర్తి ఆధార్ నంబర్‌కు బదులుగా మాస్క్డ్ ఆధార్‌ను షేర్ చేయవచ్చు. దీంతో మీ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది రాదు.