Site icon HashtagU Telugu

Helmet Dryer: హెల్మెట్ లోని బాక్టీరియాను చంపేసే డివైస్ హెల్మెట్.. ధర ఎంతో తెలుసా?

Helmet Dryer

Helmet Dryer

ట్రాఫిక్ పోలీసులు బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని చెప్పినా కూడా వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా బైకును ఇష్టానుసారంగా బైక్ నడిపి ప్రాణాలను తీసుకున్న వారు చాలామంది ఉన్నారు. అయితే బయట ట్రాఫిక్ లో వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకున్నా కూడా కొన్ని కొన్ని సార్లు దుమ్ము దూళి పడుతూ ఉంటుంది. కానీ హెల్మెట్ ఉంటే ప్రాణాలను కాపాడడంతో పాటు దుమ్ము దూళి నుంచి కూడా రక్షిస్తుంది. అయితే బండి ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినప్పటికీ కొన్ని కొన్ని సార్లు దుమ్ము ధూళి వాహనాలకు నిండుకోవడం వల్ల హెల్మెట్ లో చిన్న చిన్న బ్యాక్టీరియా ఉండే ఉంటుంది.

మరి హెల్మెట్ లో ఉన్న దుమ్ము, ధూళితో నిండే ఆ హెల్మెట్‌ని శుభ్రం చేసుకోవడం ఎలా? అనుకునే వారికి పరిష్కారం ఇదిగో ఈ డ్రైయర్‌.. ఇది క్రిములు, వైరస్‌లు, దుర్వాసన కలిగించే బాక్టీరియా, వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు వంటివన్నిటినీ చంపేస్తుంది. 99.99 శాతం శుభ్రపరుస్తుంది. ఫుల్‌ ఫేస్‌ హెల్మెట్, హాఫ్‌ ఫేస్‌ హెల్మెట్, సైకిల్‌ హెల్మెట్‌ ఇలా అన్నింటికీ ఉపయోగపడుతుంది. మరోవైపు ఈ డివైస్‌తో సాక్స్, గ్లౌవ్స్, షూ వంటివాటినీ ఆరబెట్టుకోవచ్చు. అందుకు వీలుగా చిత్రంలో ఉన్న విధంగా అడ్జస్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్స్‌ అన్నీ డివైస్‌కి కుడివైపే ఉంటాయి.

అయితే ఇన్ని మంచి మంచి ఫీచర్లు కలిగిన ఈ హెల్మెట్ ధర. 53 డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.4356 మాత్రమే. చాలామందికి ధర కాస్త ఎక్కువ అయినప్పటికీ ఈ హెల్మెట్ ని కొనుగోలు చేయడం వల్ల ఆ ప్రాణాలను రక్షించుకోవడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు..