EV battery: ఈవీ బ్యాటరీ.. మూడు నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్.. సరికొత్త టెక్నాలజీ!

ప్రస్తుత రోజుల్లో చాలామంది పెట్రోల్,డీజిల్ వాహనాలతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలనే ఎక్కువగా

  • Written By:
  • Updated On - September 17, 2022 / 11:28 PM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది పెట్రోల్,డీజిల్ వాహనాలతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ వాహనాలు కంటే ఎలక్ట్రిక్ వాహనాలనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కేవలం బైకుల విషయంలోనే కాకుండా కార్ల విషయంలో కూడా ఈ విధంగానే ఆసక్తిని చూపిస్తున్నారు వినియోగదారులు. అయితే ఎలక్ట్రిక్‌ కార్ల మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉన్నా వీటిలో కొన్ని మైనస్‌లు వాహనదారులను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ముఖ్యంగా చార్జింగ్ టైమ్ వల్ల వినియోగదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.

కాగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లను ఫుల్ గా ఛార్జ్ చేయాలి అంటే 30 నిమిషాల నుంచి దాదాపుగా 8 గంటల సమయం పడుతోంది. అయితే ఈ సమయాన్ని తగ్గించడం కోసం ఒక సరికొత్త చార్జింగ్ టెక్నాలజీని తీసుకురానున్నారు నిపుణులు. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన అడెన్ ఎనర్జీ అనే స్టార్టప్ ఒక అద్భుతమైన ఈవీ బ్యాటరీని అభివృద్ధి చేసింది. ఈ బ్యాటరీ కేవలం 3 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. అంతేకాదు, 20 ఏళ్ల పాటు మన్నికతో వస్తుందట.

కాగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు ఉపయోగిస్తున్న బ్యాటరీలు పదేళ్ల కంటే ఎక్కువ కాలం పని చేయలేవు. అదేవిధంగా ఫాస్ట్ గా కూడా ఛార్జ్ అవ్వలేవు. కానీ తాజాగా అభివృద్ధి చేసిన ఈ బ్యాటరీ ఎక్కువగా కాలం పాటు పని చేయడంతో పాటు తక్కువ సమయంలోనే చార్జింగ్ అయిపోతుంది. అయితే ఫుల్ ఫాస్ట్‌గా ఛార్జింగ్ అవుతున్న కూడా పాడుకాకుండా 20 ఏళ్ల పాటు మన్నికతో ఉండేలా సరికొత్త బ్యాటరీని స్టార్టప్ కంపెనీ అడెన్ ఎనర్జీ డెవలప్ చేసింది. అడెన్‌ కంపెనీని హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు స్థాపించడం విశేషం. ఈ కంపెనీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఉపయోగించడానికి ఇన్నోవేటివ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ సిస్టమ్స్ డెవలప్ చేస్తోంది.