Site icon HashtagU Telugu

Laptops & Smart Phones : ఇలా చేస్తే హాఫ్ రేటుకే లాప్ టాప్, స్మార్ట్ ఫోన్.. ప్రత్యేకంగా వారికోసమైతే..!

Half Rate For Smart Phones And Laptops

Half Rate For Smart Phones And Laptops

Laptops and Smart Phones: ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేని మనిషి.. లాప్ టాప్ లేని కాలేజ్ స్టూడెంట్ కనిపించరు. సెకండరీ స్కూలింగ్ పూర్తైతే చాలు స్మార్ట్ ఫోను కొనుక్కుని ప్రపంచాన్ని తన చేతుల్లో పెట్టుకుంటున్నారు. ఇక కాలేజ్ స్టూడెంట్స్ అయితే లాప్ ట్యాప్ కంపల్సరీ అయిపోయింది. ఒకప్పుడు కేవలం కాలేజ్ కంప్యూటర్ ల్యాబ్ లోనే చేసే ప్రాక్టీస్ లు ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా చేస్తున్నారు.

ఇదిలాఉంటే అందరికీ అన్ని విధల ఫైనాన్షియల్ కంఫర్టబిలిటీ ఉండదు. అందుకే ఎక్కడ తక్కువ దొరుతాయి.. ఎక్కడ ఆఫర్లు ఎక్కువ ఉంటాయి అనేది వెతికి తీసుకుంటారు. అలాంటి వారికి షో రూం డిస్ ప్లే ఐటెంస్ గురించి తెలియాల్సిందే. అదేంటి అంటే ఏదైనా ప్రొడక్ట్ డెమో పీస్ అదే డిస్ ప్లే పీస్ ఉంచుతారు. వచ్చిన ప్రతి కస్టమర్ కి ఆ మోడల్ లో కావాలనుకున్న ఐటం కోసం డిస్ ప్లే లో ఉన్న దాన్ని చూపిస్తారు.

అలా స్మార్ట్ ఫోన్ (Smart Phones), లాప్ టాప్ (Laptops) ఇలా ఏదైనా డిస్ ప్లే లో పెడతారు. అలా పెట్టిన వాటిని కొనాలనుకుంటే వాటిని 50 శాతం డిస్కౌంట్ తో కస్టమర్స్ కి అందిస్తారు. ముఖ్యంగా తక్కువ డబ్బుతో ఎక్కువ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్, లాప్ టాప్ (Laptops) కావాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే డిస్ ప్లే పీస్ కదా వీటికి గ్యారెంటీ వారెంటీ లాంటివి ఎలా అనుకోవచ్చు. కంపెనీ ఇచ్చే వారెంటీ కచ్చితంగా ఉంటుంది. అయితే దీనికి బదులుగా రీఫర్ బిష్డ్ ప్రొడక్ట్ బెటర్ అనుకుంటారు. కానీ సెకండ్ హ్యాండ్ వాటిని కొత్తగా చేసి రిఫర్ బిష్డ్ గా సేల్ చేస్తారు. వాటికి ఎలాంటి వారెంటీ ఉండదు.

కానీ ఏదైనా షో రూంలో డిస్ ప్లే పీస్ అయితే కంపల్సరీ వారెంటీ ఉంటుంది. అయితే ఎక్కువ మంది చూశారన్న ఆలోచన తప్ప మరొకటి ఉండదు. కచ్చితంగా ఒక మూడు నుంచి ఐదు ఏళ్లు బాగానే పనిచేస్తాయని చెప్పొచ్చు.

Also Read:  TVS X EV : ఒక్కసారి చార్జింగ్ పెడితే 140 కి.మీ ప్రయాణం.. టి.వి.ఎస్ ఎలక్ట్రిక్ బైక్ గురించి ఇది తెలుసా..!