Site icon HashtagU Telugu

Cyber Security : సైబర్ దాడుల నుండి కాపాడటానికి ‘హ్యాక్ స్టాప్’ యాప్ వచ్చేస్తుంది.. త్వరలో విడుదల..

HackStop App coming soon for best Cyber Security

HackStop App coming soon for best Cyber Security

భారతదేశంలో రోజు రోజుకీ సైబర్ క్రైమ్(Cyber Crimes) ల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఆన్ లైన్ లో ఎన్నో మోసాలు(Online Scams) చోటు చేసుకుంటూ ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలని ఇద్దరు మహిళా సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు నడుం బిగించారు. సైబర్-సురక్షిత భారతదేశానికి భరోసా కల్పించే దిశగా దూరదృష్టితో కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను పటిష్టపరచడమే కాకుండా.. సైబర్ మోసాలను అరికట్టడమే లక్ష్యంగా ఒక వినూత్న సైబర్ సెక్యూరిటీ ప్రోడక్ట్ “HackStop”ని పరిచయం చేస్తున్నారు.

నేటి పరిస్థితుల్లో సైబర్‌ సెక్యూరిటీ(Cyber Security) చాలా ముఖ్యమైన అంశంగా మారింది. ఆన్‌లైన్ కార్యకలాపాల పెరుగుదల చాలా ఎక్కువైంది. పాన్ డబ్బా దగ్గర నుండి ఆన్ లైన్ లో వస్తువుల కొనుగోలు వరకూ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటివి విపరీతంగా వాడేస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగా సైబర్ మోసాలు కూడా ఎక్కువయ్యాయి. వ్యాపారాలు, వ్యక్తులు, ప్రభుత్వాలు కూడా సైబర్ దాడులపై ఎప్పటికప్పుడు పోరాడుతున్నాయి. తక్షణ అవసరాన్ని గుర్తించి, సైబర్ సెక్యూరిటీ డొమైన్‌లోని ప్రముఖ నిపుణులు ప్రణతి, అనూష ఇద్దరూ “హాక్‌స్టాప్”ను అభివృద్ధి చేశారు.

‘హ్యాక్ స్టాప్’ అనేది కేవలం సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్, ఫైర్ వాల్ మాత్రమే కాదు. ఇది వ్యక్తులు, సంస్థలను సైబర్ దాడుల నుండి సమర్థవంతంగా రక్షించుకోవడానికి రూపొందించబడిన సమగ్ర అవగాహన ఉత్పత్తి. ఇది అత్యాధునిక సాంకేతికత, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ల మిశ్రమం. సాంకేతిక నైపుణ్యంతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తుంది. “సైబర్ దాడులు, మోసాల నుండి ప్రజలను రక్షించడమే కాకుండా, ఈ ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం, ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండటానికి సరైన సాధనాలను వారికి అందించే పరిష్కారాన్ని మేము రూపొందించాలనుకున్నాము.” అని హ్యాక్ స్టాప్ సృష్టికర్తలు తెలిపారు.

భారతదేశాన్ని సైబర్ దాడులు, మోసాల నుండి కాపాడడానికి ఇద్దరు వ్యక్తులు చేస్తున్న ప్రయత్నం ఇది. అత్యాధునిక సైబర్‌ సెక్యూరిటీ సృష్టి “HackStop” అని చెప్పొచ్చు. సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు అనూష, ప్రణతి లు హ్యాక్‌స్టాప్‌ ను తీసుకుని వచ్చారు. పెరుగుతున్న సైబర్ నేరాల నుండి తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన విషయ పరిజ్ఞానం అందిస్తారు. ప్రజలు, సంస్థలు ఈ సైబర్ దాడులను ఎదుర్కోడానికి సర్వ సన్నద్ధం చేయడమే వారి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు, ఆన్‌లైన్ ట్రైనింగ్ మాడ్యూల్స్, రియల్ లైఫ్ సిములేషన్స్ ద్వారా HackStop వినియోగదారులకు సరైన అవగాహన కల్పిస్తుంది. డిజిటల్ గా కావాల్సిన రక్షణను ఇవ్వడమే కాకుండా.. సైబర్-దాడుల పట్ల అప్రమత్తంగా ఉంచుతుంది.. ఎలాంటి సైబర్ దాడిని అయినా ఎదుర్కోవచ్చు. సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థ ను తీసుకుని రావడానికి అనూష, ప్రణతి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. సమాజం మొత్తాన్ని సైబర్ దాడుల నుండి కాపాడడమే తమ లక్ష్యమని చెబుతున్నారు.

రెడ్‌సెక్‌ఆప్స్ సైబర్‌సెక్యూరిటీ ‘హ్యాక్ స్టాప్’ ను ఆగ‌స్టు 15న‌ ఆవిష్కరించనుంది. ఇది ఇద్దరు దూరదృష్టి ఉన్న మహిళల నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఒక సంచలనాత్మక సైబర్‌సెక్యూరిటీ ఉత్పత్తి. #CyberSafeIndia ని ప్రోత్సహించే లక్ష్యంతో.. సైబర్ దాడులను, మోసాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వ్యక్తులను, సంస్థలను సన్నద్ధం చేస్తుంది. ఇంటరాక్టివ్ సిమ్యులేషన్స్, అత్యాధునిక సాంకేతికత ద్వారా HackStop అండగా నిలుస్తుంది. సైబర్ సంరక్షకులుగా మారి, దేశ డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను పటిష్టం చేయనుంది “హాక్‌స్టాప్‌”.

 

Also Read : ChatGPT On Android : వచ్చే వారం “చాట్ జీపీటీ” మొబైల్ యాప్ రిలీజ్