Site icon HashtagU Telugu

Ampere Primus: ఆంపియన్ ప్రిమస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. మతిపోగొడుతున్న ఫీచర్స్?

Ampere Primus

Ampere Primus

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అనే కంపెనీ తాజాగా ఆంపియన్ ప్రిమస్ అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. తాజాగా విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఫీచర్ల విషయానికొస్తే.. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆంపియర్ ప్రిమస్ స్కూటర్ ధర రూ. 1,09,900గా ఉంది. అయితే వినియోగదారులు కేవలం రూ. 499 టోకెన్ అమౌంట్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం పరిమిత కాలం వరకే ఉంటుంది. కాగా ఈ ఎలక్ట్రిక్ వైట్, బ్లూ, బ్లాక్, ఆరెంజ్ కలర్స్‌తో లభిస్తోంది. కాగా ఇందులో కంపెనీ 3 కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీ విత్‌ స్మార్ట్ బీఎంఎస్ ప్యాక్‌ను అమర్చింది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు వెళ్తుందే. కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు. ఇది కేవలం 5 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. నావిగేషన్ ఫీచర్ కూడా ఉంది. యాంపియర్ నుంచి మార్కెట్‌లోకి వచ్చిన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదని చెప్పుకోవచ్చు. అలాగే వడ్డీ రేటు 8.99 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అందువల్ల ఈ స్కూటర్‌ను సులభంగానే కొనుగోలు చేయవచ్చు. కాగా ప్రస్తుతం మార్కెట్‌లో ఓలా, హీరో ఎలక్ట్రిక్, టీవీఎస్, ఏథర్ వంటి కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది.

అన్నింటి కన్నా ఓలా స్కూటర్లను జనాలు ఎక్కువగా కొంటున్నారు. దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి. తక్కువ వడ్డీకే ఫైనాన్స్, స్కూటర్లపై డిస్కౌంట్ ఆఫర్లు, జీరో డౌన్ పేమెంట్, తక్కువ ఈఎంఐ వంటి పలు రకాల ఆఫర్లు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో ఓలా అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి.

Exit mobile version