Site icon HashtagU Telugu

Google Contacts: గూగుల్ కాంటాక్ట్స్‌లో అద్భుతమైన ఫీచర్.. ఇకపై ఈజీగా లొకేషన్ షేర్ చూసుకోవచ్చట?

Mixcollage 19 Dec 2023 08 31 Pm 7524

Mixcollage 19 Dec 2023 08 31 Pm 7524

గూగుల్ కాంటాక్ట్స్.. ఈ యాప్ ని కోట్లాది మంది ఉపయోగిస్తుంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు కూడా ఈ గూగుల్ కాంటాక్ట్స్ యాప్ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యాప్‌ను కాంటాక్ట్స్ మేనేజ్ చేయడానికి, మెర్జ్ చేయడానికి, వాటిని డివైజ్‌ల్లో సింక్‌ చేయడానికి, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయడానికి ఉపయోగించవచ్చు. గూగుల్ దీనిలో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తోంది. తాజాగా కొత్త అప్‌డేట్‌లో భాగంగా లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఈ కొత్త ఫీచర్‌తో యాప్‌లోని కాంటాక్ట్స్‌ ల రియల్-టైమ్ లొకేషన్ డేటాను యాక్సెస్ చేయవచ్చు.

గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా యాప్‌లోనే లొకేషన్ డీటైల్స్ పొందడానికి ఈ ఫీచర్‌ను యూజర్లు ఉపయోగించవచ్చట. ఇదే విషయాన్ని గూగుల్ అధికారికంగా వెల్లడించింది. ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోవాలని, వారు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఫీచర్ అవుతుంది. గతంలో, కాంటాక్ట్స్ లొకేషన్‌ను మాన్యువల్‌గా షేర్ లేదా రిక్వెస్ట్ చేయడానికి గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు, లేటెస్ట్ వెర్షన్ 4.22.37.586680692 ఉపయోగిస్తున్నవారు కాంటాక్ట్స్ యాప్‌ నుంచే ఆ పనులు చేయవచ్చు. ఇంతకీ ఆ ఫీచర్‌ను ఎలా వాడాలి? అన్న విషయానికొస్తే..ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి, యూజర్ వద్ద లొకేషన్‌ను షేర్ చేయాలనుకుంటున్న లేదా లొకేషన్‌ను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్ జీమెయిల్ అడ్రస్‌ ఉండాలి. అలానే ఒకరి లొకేషన్‌ను యాక్సెస్ చేయాలంటే ముందు వారి అనుమతిని తీసుకోవాలి.

రెండూ ఉన్నట్లయితే, వారి ప్రస్తుత లొకేషన్ చూపుతూ, కాంటాక్ట్స్ యాప్‌లో వారి పేరుతో గూగుల్ మ్యాప్స్ బాక్స్‌ కనిపిస్తుంది. ఇతర కాంటాక్ట్స్‌ను చేరుకునేందుకు లొకేషన్‌ డైరెక్షన్స్ పొందడానికి ఆ బాక్స్‌పై క్లిక్ చేయవచ్చు, లేదా వారే యూజర్ లొకేషన్‌కు చేరుకున్నప్పుడు నోటిఫికేషన్‌ వచ్చేలా సెటప్ చేయవచ్చు. ఈ ఫీచర్ యాప్‌లను మార్చకుండా లేదా మెసేజ్‌లు పంపకుండా కాంటాక్ట్స్ లొకేషన్ సులభంగా చెక్ చేస్తుంది. టెక్నాలజీ గురించి పెద్దగా పరిచయం లేని వ్యక్తులకు, వృద్ధులకు ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ పెద్దగా నాలెడ్జ్ లేని వారు ఈజీగా కాంటాక్ట్స్ యాప్‌ని తెరిచి కుటుంబం, స్నేహితులు ఎక్కడ ఉన్నారో చూసుకోవచ్చు. వాస్తవానికి, కాంటాక్ట్స్ వారి లొకేషన్‌ను షేర్ చేయడానికి అంగీకరిస్తేనే ఈ ఫీచర్ పని చేస్తుంది. షేర్ చేయకూడదనుకుంటే దీన్ని ఎప్పుడైనా ఆఫ్ చేయవచ్చు.

Exit mobile version