Site icon HashtagU Telugu

GOOGLE BLUE TICK :ఇక గూగుల్ బ్లూ టిక్.. ఎందుకంటే ?

Google Blue Tick

Google Blue Tick

“బ్లూ టిక్ ” .. దీనికంటూ ఒక ధర !! దీనికంటూ ఒక రేంజ్ !! సెలబ్రిటీలకు, వీఐపీలకు ఇది స్పెషల్ ఐడెంటిఫికేషన్ !! ప్రఖ్యాత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో “బ్లూ టిక్ ” అనేది నాడు, నేడు ఎప్పుడూ ఎవరు గ్రీన్, యమ క్రేజ్ ఉన్న ఫీచర్. ఇప్పుడు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కూడా “బ్లూ టిక్ “(GOOGLE BLUE TICK) ను తీసుకురాబోతోంది. అయితే గూగుల్ బ్లూటిక్ పరమార్ధం వేరే ఉంది. వెరిఫైడ్ అకౌంట్లకు ట్విట్టర్ బ్లూ టిక్ ఇస్తోంది. వినియోగదారుల గుర్తింపును ధృవీకరించడానికి,ఆన్ లైన్ స్కామ్‌లను తగ్గించడానికి, ఈ మెయిల్ పంపినవారి పేరు పక్కన బ్లూ టిక్ (GOOGLE BLUE TICK) ను తీసుకొస్తామని గూగుల్ అంటోంది. జీ మెయిల్ వినియోగదారులు బ్లూ టిక్ మార్క్ సాయంతో నకిలీ జీమెయిల్ అకౌంట్లు చేసే ఫిషింగ్, మాల్ వేర్ దాడుల నుంచి తమని తాము కాపాడుకోవచ్చని గూగుల్ చెబుతోంది.

also read : Google Bard india Launched : ఇండియాలో రిలీజైన “గూగుల్ బార్డ్”.. వాడటం ఇలా

తొలి దశలో వీళ్ళ కోసమే.. 

2021 సంవత్సరంలో గూగుల్ కంపెనీ జీమెయిల్ మెసేజ్ ఐడెంటిఫికేషన్ బ్రాండ్ ఇండికేటర్ (బీఐఎంఐ) ఫీచర్ ను తీసుకొచ్చింది. దీనివల్ల ఈమెయిల్‌లలో బ్రాండ్ లోగోను అవతార్‌గా చూపించాలంటే.. జీ మెయిల్ టీమ్ కు బలమైన ధృవీకరణను సదరు సంస్థ అందించాలి. బ్రాండ్ లోగోను ధృవీకరించాలి. ఈ టిక్ మార్క్‌ ను గూగుల్ ప్రస్తుతానికి ఉచితంగానే ఇస్తోంది. ఇకపై కూడా బీఐఎంఐ‌ను వినియోగిస్తున్న సంస్థలన్నిటీకి ఆటోమేటిక్‌గా బ్లూ టిక్ మార్క్ కేటాయిస్తారు. ఈ ఫీచర్ తొలి దశలో గూగుల్ వర్క్ స్పేస్ కస్టమర్‌లు, లెగసీ జి సూట్ బేసిక్, బిజినెస్ కస్టమర్‌, వ్యక్తిగత గూగుల్ ఖాతాలు ఉన్న యూజర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.