Site icon HashtagU Telugu

Find My Device Network : ఫోన్‌ను దొంగ స్విచ్ఛాఫ్ చేసినా కనిపెట్టే ఫీచర్.. నేడే విడుదల

Find My Device Network

Find My Device Network

Find My Device Network : ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో అద్భుతమైన ఫీచర్ రాబోతోంది. ఇకపై మన ఫోన్ పోయినా..  దొంగిలించిన వారు దాన్ని స్విచ్ఛాఫ్ ​ చేసినా ఈజీగా కనిపెట్టొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా ? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..

We’re now on WhatsApp. Click to Join

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘ఫైండ్​ మై డివైజ్​ నెట్​వర్క్​​’ అనే ఫీచర్‌ను ఇవాళ (ఏప్రిల్ 7న) గూగుల్ కంపెనీ లాంఛ్ చేయనుంది. దీనితో మనం పోగొట్టుకున్న ఫోన్​ ఎక్కడుందో సులువుగా తెలుసుకోవచ్చు. మన ఫోన్‌ను దొంగ స్విచ్ఛాఫ్ చేసినా, దాని లొకేషన్‌ను ట్రాక్ చేయొచ్చు.  ఒకవేళ మన డివైజ్​లోని మొత్తం ఛార్జింగ్ అయిపోయినా.. దాని చివరి లొకేషన్​ను మనకు తెలియజేయడమే ఈ ఫీచర్ ప్రత్యేకత. దీన్ని ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్లెట్స్‌తో పాటు దానితో పెయిర్ చేసిన ఇయర్​బడ్స్, హెడ్​ఫోన్లకు కూడా మనం ట్రాక్ చేయొచ్చు. ఆండ్రాయిడ్​ ఫోన్​తో లింక్​ చేసి ఉన్న వాలెట్స్​, కీస్​, బైక్​ల జాడను కూడా కనిపెట్టొచ్చు. ఇప్పటికే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గూగుల్ Find My Device Appను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఉపయోగించి ఆండ్రాయిడ్​ ఫోన్లను ట్రాక్ చేయొచ్చు. కానీ ఎవరైనా ఆ ఫోన్​ను స్విచ్ఛాఫ్ చేస్తే.. దాని జాడను గుర్తించడం వీలుకాదు. ఈ లోపాన్ని అధిగమించడానికి ‘ఫైండ్ మై డివైజ్ నెట్​వర్క్’ను ఇవాళ గూగుల్ లాంఛ్ చేయనుంది.

Also Read :6 Months War : హమాస్‌తో ఆరునెలలుగా యుద్ధం.. ఇజ్రాయెల్ గెలుపా ? ఓటమా ?

Also Read : AP Hot : ఏపీలో టెంపరేచర్ టెన్షన్.. 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు