Site icon HashtagU Telugu

Google Badges : గూగుల్‌లోనూ వెరిఫికేషన్ బ్యాడ్జీలు.. ఫేక్ అకౌంట్స్‌కు చెక్

Google Badges Google Search

Google Badges : ఇతర టెక్ వేదికలకు ధీటుగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజ కంపెనీ గూగుల్ రూపు దిద్దుకుంటోంది. కొంగొత్త ఫీచర్లతో తమ యూజర్లను అలరించేందుకు రెడీ అవుతోంది. ఫేస్ బుక్, వాట్సాప్, ఎక్స్‌లలో పేరుగాంచిన వెరిఫికేషన్ బ్యాడ్జీలను జారీ చేయాలని గూగుల్ కూడా యోచిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. అయితే ఇప్పటికే గూగుల్‌ సెర్చ్‌ రిజల్ట్స్‌లో ఒక తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మెటా, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ కంపెనీల అధికారిక వెబ్‌సైట్ల లింక్‌ పక్కన బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జీ కనిపిస్తోంది.టెస్టింగ్‌లో భాగంగానే వాటికి ఈ బ్యాడ్జీలను గూగుల్ కేటాయించినట్లు సమాచారం.

Also Read :Gold Types : 18కే, 22కే, 24కే బంగారం రకాల్లో తేడా ఏమిటి ? క్యారట్ల వ్యాల్యూ ఎంత ?

ప్రముఖ కంపెనీల అధికారిక అకౌంట్లను గుర్తించేందుకు కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని రంగాల ప్రముఖ కంపెనీల వెబ్ యూఆర్ఎల్‌ల పక్కన వేరిఫైడ్ బ్యాడ్జీలను(Google Badges) డిస్‌ప్లే చేస్తున్నామని పేర్కొంది. ఫేక్ అకౌంట్లలోకి గూగుల్ యూజర్లు వెళ్లి మోసపోకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. మోసపూరిత వెబ్ కంటెంట్‌ను గుర్తించి, సెర్చ్‌ రిజల్ట్స్‌లో చూపించకుండా ఉండేందుకు ఇప్పటికే తాము  ఆటోమేటెడ్‌ సిస్టమ్స్​ను వాడుతున్నామని గూగుల్ పేర్కొంది.

ఏ లోన్‌కు అప్లై చేయాలన్నా మొదట మనకు మంచి క్రెడిట్ స్కోరు ఉండాలి. గూగుల్ పే యాప్‌లోనూ మనం సిబిల్ స్కోర్‌ను చెక్ చేయొచ్చు. మనం చేసిన లేట్ పేమెంట్ల వివరాలను కూడా ఈ రిపోర్టులో చూసుకోవచ్చు. సిబిల్ స్కోర్  అనేది మీ క్రెడిట్ యోగ్యతను తెలియజేస్తుంది. అంటే మీరు ఎంతవరకు లోన్ తీసుకోవచ్చు అనేది నిర్ణయించేది సిబిల్ స్కోరే.  750 కంటే ఎక్కువ స్కోరు ఉంటే చాలా బెస్ట్. 850 కంటే ఎక్కువ స్కోరు ఉంటే మరింత బెటర్. గూగుల్ పే యాప్‌లో మీ సిబిల్ స్కోర్‌ని ట్రాన్స్ యూనియన్ సిబిల్ ద్వారా అందిస్తారు. అంతేకాదు మీ సిబిల్ స్కోరును ప్రస్తుత స్థాయికి మించి పెంచుకునేందుకు ఏమేం చేయాలి అనే టిప్స్‌ను కూడా ఈ యాప్ అందిస్తుంది.