Site icon HashtagU Telugu

Apps: మీ ఫోన్‌లో కూడా ఈ యాప్స్‌ ఉన్నాయా.. అయితే వెంటనే డిలీట్‌ చేయండి లేదంటే?

Mixcollage 16 Feb 2024 04 49 Pm 9902

Mixcollage 16 Feb 2024 04 49 Pm 9902

టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతుండడంతో అందుకు తగ్గట్టుగా సైబర్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. మారుతోన్న టెక్నాలజీతోపాటు నేరాలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేరాల కూడా మారాయి. చిన్న మొబైల్ యాప్‌తోనే డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు. మొబైల్‌ యాప్స్‌ సహాయంతో డేటాను చోరీ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో మొబైల్‌ యాప్స్‌ వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ఫేక్ యాప్స్ బారిన పడి ఇప్పటికే ఎంతోమంది మోసపోయిన విషయం తెలిసిందే.

ఎప్పటికప్పుడు అధికారులు ఈ విషయాలపై జాగ్రత్తలు చెబుతూ వస్తున్నప్పటికీ చాలా మంది ఇంకా మోసపోతూనే ఉన్నారు. ఇకపోతే తాజాగా కూడా అలాంటి కొన్ని యాప్స్ గుర్తించారు. ఇంతకీ ఆ యాప్స్ ఏవి అన్న విషయానికి వస్తే.. ఫిబ్రవరి నెల ప్రారంభంలో ఈఎస్‌ఈటీ అనే మాల్వేర్‌ ప్రొటెక్షన్‌ కంపెనీ ఇలాంటి 12 డేంజర్‌ యాపల్‌లను గుర్తించింది. ఈ యాప్‌ల ద్వారా డేటా గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించారు. సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం, ఈ యాప్‌లన్నీ మెసేజింగ్ టూల్స్‌గా పనిచేస్తున్నాయి. ఈ యాప్‌లన్నీ రహస్యంగా బ్యాక్‌గ్రౌండ్‌లో VajraSpy అనే రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (RAT) కోడ్‌ని ఉపయోగించాయి.

ఈ యాప్స్‌ రహస్యంగా స్మార్ట్ ఫోన్‌లోని ఫైల్‌లు, కాల్ లాగ్‌లు, ఎస్‌ఎమ్‌ఎస్‌లను దొంగలిస్తున్నాయి. ఈ యాప్‌లలో కొన్ని యూజర్‌ల వాట్సాప్‌ డేటాను సైతం దోచేస్తున్నారు. అంతే కాకుండా సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం, కెమెరాలతో ఫొటోలు తీయడం వంటి పనులు కూడా ఈ యాప్స్ సాయంతో చేస్తుంటారు. ఈ స్పై యాప్స్‌ ఇవే.. హలో చాట్, చిట్ చాట్, మీట్ మీ నిడస్, రఫాకత్ న్యూస్, వేవ్ చాట్, ప్రైవ్ టాక్, గ్లో గ్లో, లెట్స్ చాట్, క్విక్ చాట్, యోహో టాక్ వంటి యాప్స్‌ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి ప్పటికే తొలగించారు. ఒకవేళ ఎవరి ఫోన్‌లో అయినా ఈ యాప్స్‌ ఉంటే వెంటనే అన్‌ ఇన్‌స్టాల్ చేయాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.