Google Pixel 9: ఆసక్తిని పెంచేస్తున్న గూగుల్‌ పిక్సెల్‌ 9 లీక్డ్‌ ఫీచర్స్‌.. లాంచ్ అయ్యేది అప్పుడే?

ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే గూగుల్‌ పిక్సెల్‌ 9 సిరీస్‌ ను లాంచ్‌ చేయనున్న

Published By: HashtagU Telugu Desk
Mixcollage 26 Jan 2024 07 32 Pm 1114

Mixcollage 26 Jan 2024 07 32 Pm 1114

ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే గూగుల్‌ పిక్సెల్‌ 9 సిరీస్‌ ను లాంచ్‌ చేయనున్నారు. ఈ ఏడాది జూన్‌ తర్వాత ఈ ఫోన్‌ను గ్లోబల్‌ మార్కెట్లోకి లాంచ్‌ కానుందని, ఆ తర్వాత భారత్‌లో గూగుల్‌ పిక్సెల్‌ 9 సిరీస్‌ లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ కొత్త ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి? ఈ ఫోన్ ని ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అన్న వివరాల్లోకి వెళితే.. గూగుల్‌ పిక్సెల్‌ నుంచి కొత్త ఫోన్‌లను ఈ ఏడాది ద్వితియార్థంలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. గూగుల్‌ పిక్సెల్‌ 9, పిక్సెల్‌ 9 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లను త్వరలోనే లాంచ్‌ చేయనున్నారు.

అయితే గూగుల్ ఈ సిరీస్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ, నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లు లీక్‌ అవుతున్నాయి. మార్కెట్ లో వైరల్ అవుతున్న ఆ ఫీచర్స్ ఆసక్తిని పెంచేస్తున్నాయి. ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని లాంచ్‌ చేయనున్న గూగుల్‌ పిక్సెల్‌ 9 సిరీస్‌లో అద్భుతమైన ఫీచర్స్‌ను అందించనున్నారు. గూగుల్‌ పిక్స్‌ల్‌ 9, 9 ప్రో పేరుతో రెండు స్మార్ట్‌ ఫోన్‌లను ఈ సిరీస్‌లో భాగంగా లాంచ్‌ చేయనున్నారు. ఇకపోతే ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..

ఇందులో డైమెన్ష‌న్స్‌ను 360 డిగ్రీ వీడియోలో ఆవిష్క‌రించే 5కే రెండ‌ర్స్‌ను ఇవ్వనున్నారు. ఇందులో 6.5 ఇంచ్ ఫ్లాట్ డిస్‌ప్లేతో పాటు సెల్ఫీ కెమెరా కోసం పంచ్‌-హోల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే రైట్‌ సైడ్‌ పవర్‌ బటన్‌, వాల్యూమ్ రాక‌ర్స్‌తో పాటు ఫ్లాగ్‌షిప్ డివైజ్ ఫ్లాట్ ప్రేమ్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. డివైజ్ కింది భాగంలో యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌, స్పీక‌ర్ గ్రిల్‌ వంటి అధునాతన ఫీచర్లను అందించనున్నారు.

  Last Updated: 26 Jan 2024, 07:32 PM IST