Site icon HashtagU Telugu

Google Pixel 9 Pro: గూగులో పిక్సెల్ 9 ప్రో పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. అన్ని వేల తగ్గింపు!

Google Pixel 9 Pro

Google Pixel 9 Pro

గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ తాజాగా సెప్టెంబర్ 4న అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ ఈ హ్యాండ్‌సెట్‌ ను పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్‌ తో ప్రారంభించింది. కాగా ఈ గూగుల్ మొట్ట మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్ భారత్ లో ప్రారంభమైంది. ఇందులో అనేక AI ఫీచర్లు ఉన్నాయి. ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ స్మార్ట్‌ ఫోన్ టెన్సర్ జీ4 ప్రాసెసర్‌ తో వస్తుంది. ఇది భద్రత కోసం ప్రత్యేక చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఇకపోతే గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ధర విషయానికి వస్తే.. రూ.1,72,999 గా ఉంది. ఈ ఫోన్ 16జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది.

మీరు ఈ హ్యాండ్‌సెట్‌ ను ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులపై వినియోగదారులు రూ.10,000 తగ్గింపును పొందవచ్చట. దీనితో పాటు రూ.13,500 ఎక్స్ఛేంజ్ బోనస్‌ ను కూడా గూగుల్ అందిస్తోంది. మీరు ఏదైనా ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకున్నప్పుడు ఈ ఆఫర్‌ ను పొందుతారు. మీరు ఈ హ్యాండ్‌సెట్‌ని Emi లో కూడా కొనుగోలు చేయవచ్చట. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ 6.3 అంగుళాల యాక్చువా కవర్ డిస్‌ప్లే, 8 అంగుళాల సూపర్ యాక్చువా మెయిన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ గరిష్ట బ్రైట్‌నెస్‌ 2700 నిట్స్‌. డిస్‌ప్లై 120Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో వస్తుంది. ఇది 16జీబీ ర్యామ్ , 256జీబీ స్టోరేజీని కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 14తో విడుదలైన ఈ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ త్వరలో ఆండ్రాయిడ్ 15కి అప్‌డేట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ 7 సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌ లను పొందుతుంది. హ్యాండ్‌సెట్ టెన్సర్ జీ4 ప్రాసెసర్‌ పై పనిచేస్తుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. దీని ప్రైమరీ కెమెరా 48ఎంపీ. ఇది కాకుండా, 10.5ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10.8ఎంపీ టెలిఫోటో లెన్స్ అందుబాటులో ఉన్నాయి. ముందు భాగంలో కవర్ స్క్రీన్, మెయిన్ స్క్రీన్ రెండింటిలోనూ 10ఎంపీ సెల్ఫీ కెమెరా అందించబడింది. ఫోన్‌ బ్యాటరీ 4650mAh. ఇది 45W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.