Google Pixel 9 Pro Fold: మార్కెట్లోకి గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ లాంచ్.. పూర్తి వివరాలివే?

ఇండియా తాజాగా గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ను ఆగస్టు 14న రాత్రి 10:30 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్, పిక్సెల్ వాచ్ 3 లను సమర్పించే గ్లోబల్ లాంచ్ ఈవెంట్ తరువాత ఈ ఈవెంట్ ను ఆగస్టు 1

  • Written By:
  • Publish Date - July 21, 2024 / 01:00 PM IST

ఇండియా తాజాగా గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ను ఆగస్టు 14న రాత్రి 10:30 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్, పిక్సెల్ వాచ్ 3 లను సమర్పించే గ్లోబల్ లాంచ్ ఈవెంట్ తరువాత ఈ ఈవెంట్ ను ఆగస్టు 13 న తేదీకి షెడ్యూల్ చేశారు. అయితే గూగుల్ తన పిక్సెల్ ఫోన్లను అక్టోబర్లో విడుదల చేస్తుంటుందట. కానీ ఈ ఈవెంట్ ను మాత్రం ఆగస్టులో ఏర్పాటు చేసింది. ఇకపోతే త్వరలో విడుదల కానున్న గూగుల్ పిక్సెల్ 9 ప్రో డిజైన్, ఫీచర్ల విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

పిక్సెల్ 9 ప్రో టీజర్ వీడియోలో మూడు లెన్స్ లు, ఎల్ఈడీ ఫ్లాష్, టెంపరేచర్ సెన్సార్ తో కూడిన కెమెరా మాడ్యూల్ కూడా ఉంది. గూగుల్ పిక్సెల్ 9 ప్రోతో పాటు, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ను కూడా టీజర్ వీడియోలో చూపించారు. అయితే ఈ ఫోల్డబుల్ డివైజ్ లో ఎగువ ఎడమ మూలలో కెమెరా మాడ్యూల్, మూడు లెన్స్ లు, ఎల్ఈడీ ఫ్లాష్, మైక్రోఫోన్ ఉన్నాయి. ఈ టీజర్ వీడియోలో కెమెరా బంప్, లెన్స్ ల కోసం డ్యూయల్ లెవల్ ఫోల్డబుల్ డిజైన్ కూడా ఉంది. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ గూగుల్ రెండవ తరం ఫోల్డబుల్ ఫోన్ గా చెప్పవచ్చు. అలాగే గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ దాని అంతర్గత కెమెరా కోసం స్క్రీన్ కటౌట్ ను కలిగి ఉంటుందట.

ఇది ఒరిజినల్ గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ కు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ కొత్త డిజైన్ ఎలిమెంట్ ఫోల్డబుల్ స్క్రీన్ లో కెమెరా క్వాలిటీని మరింత మెరుగుపర్చడం లక్ష్యంగా పెట్టుకుందట గూగుల్. అలాగే గూగుల్ తన జెమినీ ఏఐని కొత్త పిక్సెల్ డివైజ్ లలో చేర్చనున్నట్లు ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ పోర్స్లియన్, అబ్సిడియన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో పోర్సిలియన్ వేరియంట్ ను మాత్రమే గూగుల్ ఇండియా టీజ్ చేసింది. అయితే, లాంచ్ తర్వాత మరిన్ని కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.

Follow us