Google Pixel 9 Pro Fold: మార్కెట్లోకి రాబోతున్న గూగుల్ ఫోల్డ్ ఫోన్.. లాంచింగ్ డేట్ ఫిక్స్!

గూగుల్ పిక్సెల్ ఫోన్ లకు భారతదేశంలో ఉన్న డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ ల ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ ఇందులోని ఫీచర్లు వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలా రకాల వేరియంట్ లను విడుదల చేసిన గూగుల్ పిక్సెల్ సంస్థ తాజాగా గూ

  • Written By:
  • Publish Date - July 26, 2024 / 04:25 PM IST

గూగుల్ పిక్సెల్ ఫోన్ లకు భారతదేశంలో ఉన్న డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ ల ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ ఇందులోని ఫీచర్లు వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలా రకాల వేరియంట్ లను విడుదల చేసిన గూగుల్ పిక్సెల్ సంస్థ తాజాగా గూగుల్ పిక్సల్ 9 సిరీస్ లో మరో వేరియంట్ ను లాంచ్ చేసేందుకు కంపెనీ డేట్ ఫిక్స్ చేసింది. అధికారిక టీజర్ల ప్రకారం 2024, ఆగస్టు 13వ తేదీన గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

అయితే గూగుల్ నుంచి వస్తున్న రెండో ఫోల్డబుల్ ఫోన్ ఇదే. కాగా మన దేశంలో లాంచ్ కానున్న మొదటి గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. అయితే గూగుల్ ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా విడుదల చేయలేదు. కొన్ని రూమర్స్, లీకులు మాత్రం ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ అంతకు ముందు ఉన్న ఫోల్డబుల్ ఫోన్ కి పూర్తి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. రాబోయే స్మార్ట్‌ఫోన్ దాని మునుపటి కంటే చాలా పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 8 అంగుళాల డిస్ ప్లే ఉంటుందని చెబుతున్నారు.

ఫోల్డ్ 1 ఫోన్లో 7.4 అంగుళాల డిస్ ప్లే ఉండగ కొత్త ఫోన్ అప్‌గ్రేడ్ అయ్యింది. కొత్త డిస్‌ప్లే స్పష్టంగా 2152 x 2076 రిజల్యూషన్‌ ను కలిగి ఉంటుంది. 1,600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను అందిస్తుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌ కు మద్దతు ఇస్తుంది. కాగా ఈ గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ ధర 256జీబీ వెర్షన్ ధర సుమారు రూ. 1 84,000 ఉండనుంది. ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ ను కూడా గూగుల్ ఫిక్స్ చేసింది. ఆగస్టు 13వ తేదీన గ్రాండ్ గా దీనిని ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Follow us