ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ గూగుల్ ఇప్పటికే మార్కెట్లోకి చాలా రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త కొత్త ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ పై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..కాగా గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో, గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది.
కాగా ఈ గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ ను నేడు అనగా ఆగస్ట్ 14న లాంచ్ కానుంది. గూగుల్ పిక్సెల్ 8 ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ సేల్ లో భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ ఫోన్స్ ను గూగుల్ గత ఏడాది లాంచ్ చేసింది. గూగుల్ ఇప్పుడు పిక్సెల్ 8 ఫోన్లను ఇండియాలోనే తయారు చేస్తోంది. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ లో భాగంగా గూగుల్ పిక్సెల్ 8 ప్రో కూడా ఉంది. మనదేశంలో గూగుల్ పిక్సెల్ 8 లాంచ్ సమయంలో రూ.75,999 ఉండగా, పిక్సెల్ 9 లాంచ్ కు ముందు గూగుల్ పిక్సెల్ 8ను రూ.54,999కే కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటుగా కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు.
గూగుల్ పిక్సెల్ 8 ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో రూ.17,000 తగ్గింపు తర్వాత రూ.58,999 వద్ద లిస్ట్ అయింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలపై రూ.4000 తగ్గింపుతో గూగుల్ పిక్సెల్ 8 ధర రూ.54,999కు తగ్గింది. ఒకవేళ మీ వద్ద పాత స్మార్ట్ఫోన్ ఉంటే, ఫ్లిప్ కార్ట్ మీ పాత డివైస్ కు రూ .54,150 వరకు ఎక్స్చేంజ్ బోనస్ ను ఆఫర్ చేస్తోంది. ఇకపై ఈ గూగుల్ పిక్సెల్ 8 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.2 అంగుళాల ఎఫ్ హెచ్ డీ + ఓఎఈల్డీ డిస్ప్లేను కలిగి ఉంది. 8 జీబీ ర్యామ్ తో కూడిన గూగుల్ ఇన్ హౌస్ టెన్సర్ జీ3 చిప్సెట్తో ఈ స్మార్ట్ఫోన్ పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 8 లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా విత్ మాక్రో ఫోకస్ ఉన్నాయి. ఇక వీడియో కాల్స్, సెల్ఫీల కోసం పిక్సెల్ 8 ముందు భాగంలో 10.5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ 4575 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్త్యాన్ని కలిగి ఉండనుంది.