Site icon HashtagU Telugu

Google Pixel 7A: మార్కెట్లోకి గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Google Pixel 7a

Google Pixel 7a

మార్కెట్ లో ఇప్పటికే కొన్ని వందల రకాల స్మార్ట్ ఫోన్లు ఉండగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. వినియోగదారుల కోసం ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు తక్కువ ధరలకే ఆకట్టుకునే ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే దిగ్గజ సెర్జ్‌ ఇంజిన్ గూగుల్ నుంచి ఇప్పటికే చాలా రకాల స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్ లోకి విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది గూగుల్.

ఈ నెల 10న జరగబోయే గూగుల్ IO 2023 ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్ 7ఏ మోడల్ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ ఈవెంట్‌లోనే ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ సహా అనేక రకాల ప్రోడక్ట్స్‌ కూడా లాంచ్ కాబోతున్నాయి. కాగా ఇదే విషయాన్ని గూగుల్ స్వయంగా ధృవీకరించింది. కాగా ఈ గూగుల్ పిక్సెల్ 7ఏ మోడల్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 46 వేలు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే…ఇందులో ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్‌తో 6.1 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఇదే కాక 90 Hz రిఫ్రెష్ రేట్‌‌న కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 తో పాటు Tensor జీ2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

అలాగే 4400 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండడం ఉంది. అలాగే ఇది 18W ఫాస్ట్ ఛార్జ్‌ సప్పోర్ట్ ఉంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో కెమెరా 64 మెగాపిక్సెల్స్‌తో, సెకండరీగా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఇంకా ఫోన ముందు భాగంలో 10.8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ అన్‌లైన్ సేల్ ఈ నెల 11న ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభమవుతుంది.