మార్కెట్లో ఇప్పటికే ఎన్నో రకాల ఆండ్రాయిడ్ ఫోన్ లు అందుబాటులో ఉన్నప్పటికీ చాలామంది సరికొత్త అప్ కమింగ్ మొబైల్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మార్కెట్లో ఉన్న ఫోన్లతో పాటు త్వరలోనే లాంచ్ కానున్న మొబైల్ పూర్తి వివరాలు తెలుసుకొని ఆ ఫోన్లు కొనుగోలు చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే అలా ఎదురుచూస్తున్న మొబైల్ ఫోన్లలో గూగుల్ పిక్సల్ 6ఏ సిరీస్ మొబైల్ కూడా ఒకటి. అయితే ఈ గూగుల్ పిక్సల్ 6ఏ సిరీస్ మొబైల్ కోసం ఎదురు చూస్తున్నా వారి నిరీక్షణ తొందరలోనే ఫలించబోతోంది.
ఈనెల ఆఖరిలోపు గూగుల్ పిక్సల్ 6ఏ సిరీస్ మొబైల్ భారత మార్కెట్ లోకీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ ఫోన్ ధర రూ. 40 వేల లోపు ఉంటుందని తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు పిక్సల్ 4ఎ తరువాత గూగుల్ మరే ఇతర ఫోన్ ను భారత మార్కెట్ లోకి తీసుకురాలేదు. అయితే ఆ మధ్య ఒకసారి పిక్సల్ 5 సిరీస్ ను గూగుల్ ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసినప్పటికీ భారత మార్కెట్ కు మాత్రం ఆ ఆండ్రాయిడ్ ఫోన్ ను పరిచయం చేయలేదు. అయితే పిక్సల్ 4ఏ తర్వాత ఇప్పుడు నేరుగా పిక్సల్ 6ఏ ని తీసుకురానుంది గూగుల్.
అయితే అమెరికాలో ఇప్పటికే గూగుల్ పిక్సల్ 6, 6ప్రో ఫోన్లు విడుదల అయ్యాయి. కాగా భారత్ లో విడుదల కానున్న గూగుల్ పిక్సల్ 6ఏ మొబైల్ పిక్సల్ 6 ను పోలి ఉంటుంది. కాగా ఇందులో గూగుల్ సొంత చిప్ అయినా టెన్సార్ కూడా ఉంటుంది. పిక్సల్ 6 మాదిరే గూగుల్ పిక్సల్ 6ఏ డిజైన్ కూడా ఉంటుంది. కాగా ఈ గూగుల్ పిక్సల్ 6ఏ ఫోన్ ధర భారత్ లో రూ.37,000 గా ఉండవచ్చని తెలుస్తోంది. కానీ ఈ మొబైల్ ను ఎప్పుడు విడుదల చేయనున్నారు? దాని ధర ఎంత? అన్నది ఇంతవరకు గూగుల్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ మొబైల్ ఫోన్లు ఈ నెల ఆఖరుకు మార్కెట్లోకి తీసుకురావచ్చు అని తెలుస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఫ్లిప్కార్ట్ లో కూడా విక్రయాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. గూగుల్ పిక్సల్ 6ఏ ఫోన్ ను గూగుల్ కెనడా మార్కెట్ లో కూడా విడుదల చేయగా అక్కడ 599 కెనడా డాలర్ల ధరను నిర్ణయించిందట. అదేవిధంగా బ్రిటన్ లో 399 పౌండ్లుగా నిర్ణయించిందట.