Google Pay: గూగుల్ పే వినియోగదారులకు శుభవార్త.. ఇకపై ఈజీగా విదేశీ ట్రాన్సాక్షన్స్?

ఈ రోజుల్లో ఫోన్ పేలు గూగుల్ పేలు పేటీఎం ల వాడకం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్న చిన్న హోటల్స్ నుంచి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వరకు ప్రతి

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 04:00 PM IST

ఈ రోజుల్లో ఫోన్ పేలు గూగుల్ పేలు పేటీఎం ల వాడకం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్న చిన్న హోటల్స్ నుంచి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వరకు ప్రతి ఒక్క చోట కూడా ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. చాలామంది డిజిటల్ పేమెంట్ ద్వారానే లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఇక ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే, గూగుల్ పే ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీసులను యూజర్లకు అందిస్తోంది. ఈ ఆన్లైన్ పేమెంట్స్ యాప్ లో ఎక్కువ శాతం మంది వినియోగిస్తున్న యాప్ గూగుల్ పే. ఇక వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూ ఉండడంతో గూగుల్ పే సంస్థ వారు కూడా మంచి మంచి ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

అందులో భాగంగానే తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది గూగుల్ పే. తమ సేవలను మరింత విస్తరిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ కొత్త ఫీచర్ ద్వారా విదేశాల్లో ఉండేవారికి, అదేవిధంగా విదేశీ ట్రాంజాక్షన్స్ చేసే వారికి హెల్ప్ కానుంది. ఇప్పుడు UPI పేమెంట్స్ లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇకపై రూపాయల్లోనే కాకుండా డాలర్ల రూపంలో కూడా చెల్లింపులు చేసేలా మరో ఫెసిలిటీ కల్పించబోతున్నారు. డాలర్‌ మాత్రమే కాదు వివిధ దేశాల కరెన్సీని పంపించేలా చర్యలు తీసుకొస్తున్నారు.

ఇందు కోసం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌ తో గూగుల్‌ పే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సో ఇకపై విదేశాలకు వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేమెంట్స్ చేసేందుకు వీలు కలుగుతుంది. ఈ ఫీచర్ వల్ల విదేశాలకు వెళ్లే భారతీయులు నగదును వెంట తీసుకెళ్లే అవసరం తగ్గుతుందని గూగుల్ పే అంటోంది. విదేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు మన దేశానికి నగదు పంపే సమయంలో ఇంటర్నేషనల్‌ గేట్‌ వే ఛార్జీల భారం తగ్గుతుందని చెబుతోంది. ఇది అందరికీ ఉపయోగకరమైన ఫీచర్ అని చెప్పుకోవచ్చు. కాగా UPI ట్రాన్సాక్షన్స్‌కు కూడా ఆన్‌లైన్ స్కామ్‌లు, మోసాల ముప్పు ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది. అందుకే డబ్బు, ఐడెంటిటీని రక్షించుకోవడానికి, స్ట్రాంగ్ యూపీఐ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ని క్రియేట్ చేసుకోవాలి. అలానే దానిని క్రమం తప్పకుండా మార్చాలి. యూపీఐ పిన్ అనేది యూపీఐ ట్రాన్సాక్షన్‌ను యాక్సెప్ట్ లేదా ఆథరైజ్ చేయడానికి ఎంటర్ చేసే నాలుగు లేదా ఆరు అంకెల కోడ్. యూపీఐ పిన్‌ని ఎవరితోనూ షేర్ చేయకూడదు. షేర్ చేస్తే మోసగాళ్లు డబ్బును ఈజీగా కొట్టేస్తారు.