Messages Via Satellite : ఇక సిగ్నల్స్ లేకున్నా మెసేజ్ పంపొచ్చు.. ఎలా ?

Messages Via Satellite : మనం వాడే చాలావరకు స్మార్ట్ ఫోన్లలో ఉండే సాఫ్ట్‌వేర్‌ పేరు ఆండ్రాయిడ్.

  • Written By:
  • Updated On - April 4, 2024 / 09:01 AM IST

Messages Via Satellite : మనం వాడే చాలావరకు స్మార్ట్ ఫోన్లలో ఉండే సాఫ్ట్‌వేర్‌ పేరు ఆండ్రాయిడ్. ఇది గూగుల్ కంపెనీకి చెందిన సాఫ్ట్ వేర్. ఆండ్రాయిడ్​ 15 ఫుల్ వర్షన్ ఆగస్టు-సెప్టెంబర్​ నెలల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో మరో సరికొత్త ఫీచర్ వస్తోంది.  అదే..  ‘శాటిలైట్ మెసేజింగ్’!! మారుమూల ప్రాంతాల్లో నుంచి అత్యవసర పరిస్థితుల్లో మెసేజ్​లు చేసుకునేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. త్వరలో విడుదల కానున్న ఆండ్రాయిడ్​ 15  బీటా వెర్షన్​లో ‘శాటిలైట్ మెసేజింగ్’ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా మనం అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడ నుంచైనా, ఎవరికైనా మెసేజ్‌లను పంపొచ్చు. వైఫై , మొబైల్ నెట్​వర్క్ సిగ్నల్స్ లేకున్నా మెసేజ్‌ను పంపే వీలుంటుంది. ప్రత్యేకించి మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ‘శాటిలైట్ మెసేజింగ్’ ఫీచర్(Messages Via Satellite) ఇప్పటికే ఐఫోన్స్​లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే అది అత్యవసర సేవలకు పరిమితం. ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్​లో ‘శాటిలైట్ మెసేజింగ్’‌ను అత్యవసర సేవలతో పాటు మెసేజ్​లు పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు.  ఈ ఫీచర్‌ను వాడుకొని మనం ఫొటోలు, వీడియోలను సెండ్ చేయలేం. గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్ 15 అప్​డేట్​లో 3 కీలకమైన అంశాలపై దృష్టిసారించింది. అవి ప్రైవసీ/ సెక్యూరిటీ, సపోర్టింగ్ క్రియేటర్స్​ అండ్ డెవలపర్స్​, మాక్సిమైజింగ్​ యాప్​ పెర్ఫార్మెన్స్​.

We’re now on WhatsApp. Click to Join

ఏ ఫోన్లలో డౌన్​లోడ్ చేసుకోవచ్చు  ?

ఆండ్రాయిడ్ 15 అనేది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ప్రస్తుతానికి గూగుల్​ పిక్సెల్​, ట్యాబ్లెట్స్​లో మాత్రమే ఆండ్రాయిడ్ 15 డెవలపర్​ ప్రివ్యూ 1ను టెస్ట్ చేయడానికి వీలవుతుంది. పిక్సెల్​ 8, పిక్సెల్​ 8ప్రో, పిక్సెల్​ 7, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 7ఏ, పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 6ఏ, పిక్సెల్ ఫోల్డ్​, పిక్సెల్ ట్యాబ్లెట్​ల్లో ఆండ్రాయిడ్​ 15ను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

Also Read : Jaya Prada Desire : ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. బీజేపీ పెద్దల నిర్ణయమే ఫైనల్ : జయప్రద

సాధారణ యూజర్ల సంగతేంటి ?

ప్రస్తుతం  ఆండ్రాయిడ్ 15  పరీక్షల దశలో ఉంది. అందుకే దీన్ని సాధారణ యూజర్లు డౌన్ లోడ్ చేసుకోకపోవడమే బెటర్.  అంతగా కావాలంటే ఆండ్రాయిడ్​ 15 ఫస్ట్ ప్రివ్యూను డౌన్​లోడ్​ చేసుకుంటే సరిపోతుంది. కనీసం బీటా వెర్షన్ రిలీజ్ అయ్యే వరకు ఎదురుచూడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు డెవలపర్లు దీన్ని డౌన్​లోడ్ చేసుకొని వాడొచ్చు.

Also Read :Water Crisis Vs Elections : ఎన్నికల క్షేత్రంలో ‘జల జగడం’.. గ్రేటర్ హైదరాబాద్‌లో ‘త్రి’బుల్ ఫైట్