Google Maps: గూగుల్ మ్యాప్స్ కొత్త అప్ డేట్.. ఎలా పని చేస్తుందో తెలుసా?

ప్ర‌పంచంలోనే దిగ్గ‌జ సెర్చ్‌ ఇంజీన్ అయిన‌ గూగుల్ తాజాగా మాప్స్‌లో కొత్త అప్‌డేట్స్‌ను లాంచ్‌ చేసింది.

  • Written By:
  • Updated On - February 9, 2023 / 08:04 PM IST

Google Maps: ప్ర‌పంచంలోనే దిగ్గ‌జ సెర్చ్‌ ఇంజీన్ అయిన‌ గూగుల్ తాజాగా మాప్స్‌లో కొత్త అప్‌డేట్స్‌ను లాంచ్‌ చేసింది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ నావిగేషన్ యాప్‌ను వినియోగిస్తున్న వారిని మరింత ఆకట్టుకునేలా కొత్త అప్‌డేట్స్‌ను పారిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించింది. ఇమ్మర్సివ్ వ్యూ అనే ఈ కొత్త అప్‌డేట్‌ను జత చేసింది. ప్ర‌స్తుతానికి యూరప్‌లోని కొన్ని కీలక నగరాల్లో మాత్ర‌మే ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చిన గూగుల్‌.. త్వరలోనే మిగిలిన నగరాల్లో కూడా అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తుంది.

ఈ స‌రికొత్త ఫీచర్‌ ద్వారా మీరు మ‌రింత స్పష్టంగా మీ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవ‌చ్చు. గూగుల్‌ మ్యాప్స్‌లో సాధారణ స్ట్రీట్ వ్యూ ఫీచర్ లాగానే ఇది ఉంటుంది. మరిన్ని స్ట్రీట్ వ్యూ, ఏరియల్‌ ఇమేజెస్‌తో వర్చువల్ వరల్డ్ మోడల్‌ను ఈ అప్‌డేట్ అందిస్తుంది. వాతావరణం, ట్రాఫిక్, లొకేషన్ ఎంత బిజీగా ఉంది అనే వివ‌రాల‌ను ఈ అప్‌డేట్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. రాబోయే నెలల్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ లో ప్రపంచవ్యాప్తంగా “గ్లాన్సబుల్ డైరెక్షన్స్” అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని ఈ కార్య‌క్ర‌మంలో గూగుల్ యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది.

ప్ర‌స్తుతం లండన్, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో ,టోక్యో వంటి ఐదు నగరాల్లో ఇమ్మెర్సివ్ వ్యూ ని అందుబాటులో ఉంచింది. అలాగే ఆమ్‌స్టర్‌డామ్, డబ్లిన్, ఫ్లోరెన్స్, వెనిస్‌లతో సహా మ‌రికొన్ని కీల‌క నగరాలకు ఈ ఫీచర్‌ను త్వ‌ర‌లో విడుదల చేయాలని యోచిస్తుంది. ఆయా నగరాలను సందర్శించే ముందు ప్లాన్ చేసుకోవడంతోపాటు, దానిగురించి అవగాహన పొందేందుకు ఈ అప్‌డేట్ యూజర్లకు సహాయపడుతుందని ఓ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఈ ఫీచర్‌లోని ఎడ్వాన్స్‌డ్ ఏఐ టెక్నాల‌జీ ద్వారా కంప్యూటర్‌ వ్యూలో డిజిటల్‌ వరల్డ్‌ని వీక్షించే సౌక‌ర్యం కూడా ఉన్న‌ట్లు తెలిపింది.

అంతేకాకుండా ఏటీఎంలు, రెస్టారెంట్‌లు, పార్కులు, రెస్ట్‌రూమ్‌లు, లాంజ్‌లు, టాక్సీస్టాండ్‌లు, రెంటల్‌ కార్స్‌, ట్రాన్సిట్ స్టేషన్‌లు వంటి అనేక విషయాలను గుర్తించడంలో సహాయపడటానికి మరో ఫీచ‌ర్‌ను కూడా యాడ్‌ చేసింది. ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో రూపొందించిన “సెర్చ్‌ విత్‌ లైవ్ వ్యూ” గురించి కూడా ఈ బ్లాగ్‌లో పోస్ట్ చేసింది. అలాగే బార్సిలోనా, బెర్లిన్, ఫ్రాంక్‌ఫర్ట్, లండన్, మాడ్రిడ్, మెల్‌బోర్న్, పారిస్, ప్రేగ్, సావో పాలో, సింగపూర్, సిడ్నీ తైపీ వంటి అనేక నగరాల్లోని 1,000 కొత్త విమానాశ్రయాలు, రైలు స్టేషన్‌లు , మాల్స్‌ లాంటి వివరాలు రానున్న కాలంలో అందిస్తున్న‌ట్లు ఈ బ్లాగ్‌లో రాసుకొచ్చింది.