Site icon HashtagU Telugu

Google Street Maps: గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫిచర్.. స్ట్రీట్ వ్యూ ఫిచర్?

Google Map Street View

Google Map Street View

స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువగా ఉండేసరికి యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తున్నారు. మామూలుగా మనము ఏదైనా లొకేషన్ కు వెళ్లాలి అనుకుంటే గూగుల్ మ్యాప్ ద్వారా మంచి అవకాశాన్ని కల్పించారు. తర్వాత తర్వాత కొత్త ఫీచర్లతో యూజర్లకు మరింత కొత్తదనాన్ని పరిచయం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా గూగుల్ మ్యాప్ లో మరో సరికొత్త ఫీచర్ వచ్చింది.

అది కూడా స్ట్రీట్ వ్యూ ఫీచర్. ఈ ఫీచర్ ఏంటంటే తమకు కావలసిన రోడ్డు లేదా ఏదైనా ఏరియాను జూమ్ చేసి చూసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న కేఫ్ లు, సాంస్కృతిక కేంద్రాలు, ఇల్లు, వీధులు అలా ఇతర కేంద్రాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఫలానా ప్రాంతం, ఫలానా వీధి అని స్పష్టంగా తెలుసుకోవచ్చు ఈ ఫీచర్ ద్వారా.

దీంతో యూజర్లు తమ ఫోన్ లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి.. ల్యాండ్ మార్కును ఖచ్చితంగా గుర్తించవచ్చు. ఇక ఈ ఫీచర్ను గూగుల్ జెనెసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రా కంపెనీలో భాగస్వామ్యంతో ముందుకు తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ఫీచర్ బెంగళూరు వాసులకు అందుబాటులో ఉండగా.. త్వరలో హైదరాబాదు యూజర్ల ముందుకు కూడా రానుంది. ఇక ఇందులో ఫలానా రహదారిపై వాహనాలు వేగ పరిమితులు కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మూసివేసిన రోడ్ల వివరాలను, ఇతర అవరోధాలను కూడా సులువుగా తెలుసుకోవచ్చు.