Google Map: గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్యలు ఉండవు?

ఇదివరకు మనం ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళితే అక్కడున అడ్రస్ల ఆధారంగా వెళ్లడం లేదంటే అక్కడ ఇక్కడ

  • Written By:
  • Publish Date - September 9, 2022 / 05:15 PM IST

ఇదివరకు మనం ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళితే అక్కడున అడ్రస్ల ఆధారంగా వెళ్లడం లేదంటే అక్కడ ఇక్కడ మనుషులని అడిగి వెళ్లడం లాంటివి చేసేవాళ్ళు. కానీ రాను రాను టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో కొత్త ప్రదేశాలకు వెళ్లాలి అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గూగుల్ మ్యాప్. చేతిలో మొబైల్ అందులో గూగుల్ మ్యాప్స్ యాప్ ఉంటే చాలు మనం ఎక్కడికైనా కూడా ఈజీగా వెళ్ళవచ్చు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా కొన్ని కొన్ని సార్లు ఈ గూగుల్ మ్యాప్ నీ ఉపయోగించి అయినా కూడా మనం వెళ్లాల్సిన గమ్యానికి చుట్టూ తిరిగి మనం అక్కడికి చేరుకునే లోపు కొన్ని కొన్ని సార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది.

దీంతో చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవ్వడంతో పాటు సమయం వృధాకావడం అలాగే ఇంధనం ఖర్చులు కూడా ఎక్కువ అవ్వడంతో బాధపడుతూ ఉంటారు. కాగా ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలామందికి ఎదురయ్యే ఉంటాయి. అయితే వాహనదారులను దిశలో ఉంచుకున్న గూగుల్ సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఎకో ఫ్రెండ్లీ రూట్ అనే పేరుతో వినియోగదారుడు వెళ్ళవలసిన గమ్యాన్ని అతి తక్కువ దారులను చూపిస్తూ ఇంధనం మరింత ఆదా ఏవిధంగా చేస్తుంది .

అంతేకాకుండా ఈజీగా తక్కువ సమయం పట్టే దారులని చూపిస్తుంది. తద్వారా సమయం వృధా కాకుండా ఇంజన్ ఖర్చు కూడా ఆదా అవుతుంది. ఈ ఎకో-ఫ్రెండ్లీ రూట్ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. అయితే ఇప్పటికే ఈ ఫీచర్ ని అమెరికా, కెనడా లాంటి అగ్రదేశాలలో ప్రవేశపెట్టిన తరువాత ఈ ఫీచర్‌ సుమారు అర మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించినట్లు అంచనా అని గూగుల్ వెల్లడించింది. అలాగే ఐరోపా అంతటా 40 దేశాల వరకు ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలే జర్మనీలో కూడా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.