Site icon HashtagU Telugu

Google Pixel: మార్కెట్ లోకి విడుదలైన గూగుల్ పోల్డబుల్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే!

Google Pixel

Google Pixel

ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ పోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లకు మార్కెట్లో రోజురోజుకి డిమాండ్ పెరిగిపోతుండడంతో మొబైల్ తయారీ సంస్థలు కూడా ఈ పోల్డబుల్ ఫోన్ లనే మార్కెట్ లోకి ఎక్కువగా విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా గూగుల్ మార్కెట్ లోక గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌ ఫోన్‌ ని విడుదల చేసింది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌ ఫోన్‌ టెన్సార్ జీ4 ప్రాసెసర్‌ పై పని చేస్తుంది. ఈ ఫోన్‌ లో 8 ఇంచెస్‌ తో కూడిన ఇన్నర్ డిస్‌ప్లే, 6.3 అంగుళాల కవర్ డిస్‌ప్లేను అందించారు.

ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్‌ లో 45 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కు సపోర్ట్‌ చేసే 4650 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇకపోతే ధర విషయానికొస్తే.. 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 1,72,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ ను ఆబ్సీడియన్, పోర్స్‌ లెయిన్ కలర్స్‌ లో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌ తో పాటు క్రోమా, రిలయన్స్ డిజిటల్ అవుట్ లెట్స్‌ లో అందుబాటులోకి వచ్చాయి. కాగా ఈ గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ద్వారా స్క్రీన్‌ కు ప్రొటెక్షన్ అందించనున్నారు. బయట వైపు 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. కాగా కెమెరా విషయానికొస్తే..

ఇందులో బయటవైపు 48 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. 10.5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10.8 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాను ఇచ్చారు. 5x ఆప్టికల్ జూమ్, 20x సూపర్ రెస్ జూమ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ సొంతం. ఈ ఫోన్‌లో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, అల్ట్రా వైడ్ బ్యాండ్, యూఎస్‌బీ 3.2 టైప్ సీ పోర్టు వంటి ఫీచర్లను అందించారు. సెక్యూరిటీ కోసం ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లను ప్రత్యేకంగా అందించారు.