Site icon HashtagU Telugu

Google Chrome – AI : గూగుల్ క్రోమ్‌లో ఏఐ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే ?

Google Chrome Ai

Google Chrome Ai

Google Chrome – AI : గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. త్వరలో ఒక కొత్త  ఏఐ ఫీచర్‌‌ గూగుల్ క్రోమ్‌లో రాబోతోంది. దాని పేరు “కాంటెక్స్ట్ మెనూ ట్యాబ్ గ్రూప్”.  దీనితో యూజర్లు ట్యాబ్స్‌ను సులభంగా ఆర్గనైజ్, అరేంజ్ చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్ సెట్టింగ్స్‌ పేజీలోని “అడ్వాన్స్‌డ్‌ ఏఐ” సెక్షన్‌లో ఇది అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఆర్గనైజ్ టాబ్స్ ఫీచర్‌ను ఆన్/ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా టెస్టింగ్ జరుగుతున్నందున.. ‘‘అడ్వాన్స్‌డ్‌ ఏఐ” సెక్షన్‌‌లోకి ప్రస్తుతానికి కొంతమంది టెస్టర్లకు మాత్రమే యాక్సెస్ ఇచ్చారు. ఇలా యాక్సెస్ పొందిన వారిలో ఒకరైన లియోపేవా64 (Leopeva64) అనే ట్విట్టర్ యూజర్.,. కొత్త ఫీచర్ గురించి వివరించారు. “అడ్వాన్స్‌డ్‌ ఏఐ” సెక్షన్‌తో యూజర్లు “కంపోజ్”, “ఆర్గనైజ్ ట్యాబ్స్‌” ఫీచర్లను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసుకోవచ్చని తెలిపారు. “కంపోజ్” ఫీచర్ “ఆటోఫిల్ హెల్పర్” ఆప్షన్‌కు సంబంధించినది. ఇది వెబ్ పేజీలలో బ్లాంక్ ఫామ్స్‌, ఫీల్డ్స్‌లో డీటేల్స్ ఫిల్ చేయడంలో సాయం చేస్తుంది. “ఆర్గనైజ్ ట్యాబ్స్‌” అనేది ట్యాబ్స్‌ను ఆటోమేటిక్‌గా ఆర్గనైజ్ చేయడానికి వినియోగించే  AI ఫీచర్.

We’re now on WhatsApp. Click to Join.

గూగుల్ క్రోమ్ యూజర్ ఎక్కువ సంఖ్యలో ట్యాబ్స్‌ను తెరిచినప్పుడు.. “ఆర్గనైజ్ ట్యాబ్స్‌” ఫీచర్ ట్యాబ్ బార్‌లో ఒక బటన్‌లా కనిపిస్తుంది.  దానిపై క్లిక్ చేస్తే.. అది టాపిక్, కేటగిరీ లేదా రిలవెన్స్ ఆధారంగా ట్యాబ్స్‌ను గ్రూప్స్‌గా మారుస్తుంది. యూజర్ ఆ గ్రూప్స్‌ మధ్య మారొచ్చు. లేదంటే వాటిని క్లోజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అనేది గూగుల్ క్రోమ్ ట్యాబ్స్‌ను, వాటిలోని కంటెంట్‌ను విశ్లేషించడానికి మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. మెషీన్ లెర్నింగ్‌తో అనాలసిస్ చేశాక.. ట్యాబ్స్‌ను గ్రూప్స్‌గా గ్రూప్స్‌ క్రియేట్ చేస్తుంది.  ఈ ఫీచర్ విడుదల తేదీ గురించి గూగుల్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.