Google Employees: గూగుల్ పై అసహన వ్యక్తం చేసిన ఉద్యోగులు.. మమ్మల్ని అలా ట్రీట్ చేయొద్దంటూ?

కరోనా మహమ్మారి పుణ్యమా అనే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేశాయి ఆయాకంపెనీలు. దీంతో ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోం కి పూర్తిగా అల

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 03:15 PM IST

కరోనా మహమ్మారి పుణ్యమా అనే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేశాయి ఆయాకంపెనీలు. దీంతో ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోం కి పూర్తిగా అలవాటు పడిపోయారు.. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపోవడంతో వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని తీసేసి ఉద్యోగులను ఆఫీస్ కు రప్పించేందుకు గూగుల్ సంస్థ సతమతమవుతోంది. హైబ్రిడ్ మోడల్ లో భాగంగా ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ ల నుంచి వర్క్ చేయాలని గూగుల్ సంస్థ కోరుతోంది. కానీ దీనిని మాత్రం ఎంప్లాయిస్ పట్టించుకోవడం లేదు.

దీంతో ఉద్యోగుల హాజరు కార్యాలయంలో సిబ్బంది కదలికలను ట్రాక్ చేస్తూ పర్ఫామెన్స్ రివ్యూ సందర్భంగా గ్రేడింగ్ ఉంటుంది అని గూగుల్ హెచ్చరించింది. దీంతో గూగుల్ పై ఉద్యోగులు మండిపడుతున్నారు. గూగుల్ వార్నింగ్ ను సీరియస్ గా తీసుకొని ఉద్యోగులు కంపెనీ తమను స్కూల్లో పిల్లల చూస్తుంది అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. హైబ్రిడ్ వర్క్ మోడ్ కు తాము పూర్తిగా మారిపోయామని, టీం లీడర్లు వారి టీం సభ్యులు హైబ్రిడ్ వర్క్ మోడల్ ను ఎలా అనుసరిస్తున్నారు అన్న దానిపై రిపోర్ట్స్ ను పరిశీలిస్తారని కంపెనీ ప్రతినిధి తెలిపారు. గూగుల్ లో మాస్ లేఆఫ్స్ అనంతరం హైబ్రిడ్ వర్క్ పాలసీలో మార్పులు తీసుకొచ్చారు. వారానికి కనీసం మూడు రోజులైనా గూగుల్ ఆఫీసులకు వచ్చి పనిచేయాలని ఉద్యోగులకు సెర్చ్ఇంజన్ దిగ్గజం స్పష్టం చేసింది.

హైబ్రిడ్ వర్క్ మోడల్ ను అనుసరించి ఉద్యోగులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని గూగుల్ సంస్థ ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చేసింది. అలాగే రిటర్న్ టు ఆఫీస్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉద్యోగుల పేవలమైన పెర్ఫార్మన్స్ రివ్యూ పొందుతారని హెచ్చరించింది. పెర్ఫార్మన్స్ రివ్యూ సందర్భంగా ఉద్యోగుల హాజరు ను తనిఖీ చేస్తామని గూగుల్ తేల్చి చెప్పింది. గూగుల్ ఆఫీసులకు ఉద్యోగాలు విధిగా రావాలని రిమోట్ వర్కర్లు హైబ్రిడ్ వర్క్ షెడ్యూల్ ను పాటించాలని, టీమ్స్ గా పని చేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు అని గూగుల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫియానా సిసోని వెల్లడించారు.