Google Docs: గూగుల్ డాక్స్ లో సరికొత్త ఫీచర్…ఎలా పనిచేస్తుందంటే..!

గూగుల్ డాక్స్ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోంది. లెటెస్ట్ గా టెక్ట్స్ వాటర్ మార్క్స్ అనే ఓ కొత్త ఫీచర్ ను గూగుల్ డాక్స్ రిలీజ్ చేసింది. ఈ ఫీచర్ తో యూజర్లు తమ డాక్యుమెంట్స్ లోని ప్రతి పేజీలో టెక్ట్స్ వాటర్ మార్క్ ను ప్లేస్ చేసుకోవచ్చు.

  • Written By:
  • Updated On - January 29, 2022 / 10:17 AM IST

గూగుల్ డాక్స్ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోంది. లెటెస్ట్ గా టెక్ట్స్ వాటర్ మార్క్స్ అనే ఓ కొత్త ఫీచర్ ను గూగుల్ డాక్స్ రిలీజ్ చేసింది. ఈ ఫీచర్ తో యూజర్లు తమ డాక్యుమెంట్స్ లోని ప్రతి పేజీలో టెక్ట్స్ వాటర్ మార్క్ ను ప్లేస్ చేసుకోవచ్చు. ఏదైనా డాక్యుమెంట్ ఫైల్ షేర్ చేయడానికి ముందు దాని స్టేటస్ తెలిపేందుకు యూజర్లు కాన్ఫిడెన్షియల్ లేదా డ్రాఫ్ట్ర్ లాంటి టెక్ట్స్ వాటర్ మార్క్ లను క్రియేట్ చేసి ప్రతి పేజీలోనూ యాడ్ చేసుకోవచ్చు. ఈ టెక్ట్స్ వాటర్ మార్క్ ఆప్షన్ గూగుల్ డాక్స్ లోని ఇన్ సర్ట్ మెనూలో ఉంటుంది. ఈ ఆప్షన్ వాటర్ మార్క్ టెక్ట్స్ ఫాంట్ సైజు, ట్రాన్స్ పరసీ పొజిషన్ వంటి వాటిని కస్టమైజ్ చేయడానికి కూడా పర్మిషన్ ఉంటుంది. దీంతో డాక్యుమెంట్ లు మరింత ప్రొఫెషనల్ గా కనిపిస్తాయి.

ఇక వర్క్ స్పేస్ కస్టమర్లు, జీ సూట్ బేసిక్ యూజర్లు, బిజినెస్ కస్టమర్లతోపాటు యూజర్లందరి కోసం గూగుల్ డాక్స్ వాటర్ మార్క్స్ ఫీచర్ను గూగుల్ అందుబాటులోకి తీసుకువస్తుంది. గూగుల్ జనవరి 24న ఈ ఫీచర్ను రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది. ఇంకొన్ని రోజుల్లో ఇది యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. గూగుల్ డాక్స్ లోని వాటర్ మార్క్ కేవలం గూగుల్ టూల్ కు మాత్రమే పరిమితం కాదు.
ఈ వాటర్ మార్క్ టెక్ట్స్ అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ నుంచి డాక్యుమెంట్లను ఇంపోర్ట్ చేసేటప్పుడు లేదా ఎక్స్ పోర్ట్ చేస్తున్నప్పుడు అలానే ఉంటుంది. గతేడాది సెప్టెంబర్ లో గూగుల్ కంపెనీ గూగుల్ డాక్స్ లో ఇమేజ్ వాటర్ మార్క్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది డాక్యుమెంట్ లోని ప్రతిపేజీలోఇమేజ్ వాటర్ మార్క్ ను ఇన్ సర్ట్ చేసేందుకు యూజర్లకు అనుమతి ఇస్తుంది. యూజర్లు తమ డాక్యుమెంట్లకు కంపెనీ లోగోలు మరియు బ్రాండింగ్ వంటి యాడ్ చేయడానికి ఈ ఫీచర్ సహకరిస్తుంది.