Google: గూగుల్ డిస్కవర్ అంటే ఏంటి.. మనకు ఎలా ఉపయోగపడుతుంది?

గూగుల్ డిస్కవర్ ఈ పేరు వినగానే చాలామంది అదేదో కొత్తగా వర్డ్ అని అనుకొంటూ ఉంటారు. కానీ చాలామంది అనుకున్నట్టుగా ఇదేదో కొత్త వర్డ్ కాదు.

  • Written By:
  • Updated On - June 19, 2022 / 10:08 AM IST

గూగుల్ డిస్కవర్ ఈ పేరు వినగానే చాలామంది అదేదో కొత్తగా వర్డ్ అని అనుకొంటూ ఉంటారు. కానీ చాలామంది అనుకున్నట్టుగా ఇదేదో కొత్త వర్డ్ కాదు. ఇది మనం నిత్యం ఉపయోగించే గూగుల్ డిఫాల్ట్ పేజీనే. ఇది మనకు హోమ్ స్క్రీన్‌ను స్టాండ్‌బై మోడ్‌లో స్లయిడ్ చేసిన వెంటనే కనిపిస్తుంది. ఇది మన ఫోన్ బ్రౌజర్‌లో కూడా కనిపిస్తుంది. గూగుల్ 2016 సంవత్సరంలో గూగుల్ ఫీడ్ ఫీచర్‌ని రీబ్రాండ్ చేసి పునరుద్ధరించింది. దీనిని గూగుల్ డిస్కవర్ పేరుతో ఫీచర్‌గా అప్‌గ్రేడ్ చేసింది.

గూగుల్ డిస్కవర్ కూడా గూగుల్ ఫీడ్ మాదిరిగా పనిచేస్తుంది. ఇకపోతే ఇది ఎలా పనిచేస్తుంది అన్న విషయానికి..ఒకవేళ మీరు డిజిటల్ మీడియాలో పని చేస్తున్నట్లు అయితే వార్తలు లేదా కంటెంట్ వెబ్‌సైట్‌లలో పని చేస్తున్నట్లయితే లేదా మీ సొంత వెబ్‌సైట్‌ను కలిగి ఉంటే, మీకు గూగుల్ డిస్కవర్ తప్పనిసరిగా తెలిసే ఉండి ఉంటుంది. కానీ దాని గురించి కొందరికి తెలియకపోవచ్చు కానీ దాని గురించి తెలుసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మీ వెబ్‌సైట్ గూగుల్ డిస్కవర్‌లో మీ వెబ్‌సైట్ ఎంత ఎక్కువగా కనిపిస్తే దానికి అంత మెరుగైన ట్రాఫిక్ లభిస్తుంది. అంటే మీరు దానిని చూసేవారు సందర్శకులను పొందుతారు. ఇకపోతే గూగుల్ తెలిపిన వివరాల మేరకు గూగుల్ డిస్కవర్ మీ వెబ్‌సైట్ ట్రాఫిక్‌ను మరింత పెంచుతుంది. అంతేకాకుండా అప్పుడు గూగుల్ సెర్చ్‌లో ఏది వెతికినా ఆ ఫలితాలు కనిపిస్తాయి. కానీ గూగుల్ డిస్కవర్ నిర్వచనం ప్రకారం మీరు వెతకని వాటిని కూడా దాని యొక్క ముఖ్య ప్రత్యేకత. ఇది మీ ఆసక్తికి అనుగుణంగా ఇది వెబ్, మొబైల్ యాప్‌లలో మీ కార్యకలాపాల ఆధారంగా కథనాలను చూపుతుంది.