Google Cloud Next : గూగుల్ మీట్ నుంచి గూగుల్ డాక్స్ దాకా.. సరికొత్త ఏఐ ఫీచర్స్

Google Cloud Next : గూగుల్ వర్క్​స్పేస్ సూట్‌ను చాలామంది వినియోగిస్తుంటారు. అందులో ఇప్పుడు అత్యాధునిక ఏఐ ఫీచర్లను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • Written By:
  • Updated On - April 10, 2024 / 03:22 PM IST

Google Cloud Next : గూగుల్ వర్క్​స్పేస్ సూట్‌ను చాలామంది వినియోగిస్తుంటారు. అందులో ఇప్పుడు అత్యాధునిక ఏఐ ఫీచర్లను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ డాక్స్, మీట్, చాట్, షీట్ లాంటి ప్రొడక్టుల్లోనూ ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అమెరికాలోని లాస్​ వెగాస్‌లో జరిగిన గూగుల్ క్లౌడ్ నెక్ట్స్-2024(Google Cloud Next)  కాన్ఫరెన్సులో ఈవివరాలను గూగుల్ వెల్లడించింది. తాము తీసుకొచ్చిన ఏఐ ఫీచర్లు యూజర్ల పనిని మరింత ఈజీ చేస్తాయని తెలిపింది.  ఇంతకీ ఆ ఏఐ ఫీచర్లు ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

గూగుల్ మీట్

గూగుల్ మీట్‌ను మన దేశంలో కోట్లాది మంది వాడుతుంటారు. ఈ యాప్‌లో తీసుకొచ్చిన ఏఐ ఫీచర్ పేరు ‘Take Notes for me’. ఈ ఫీచర్ మీ కోసం నోట్స్ రాస్తుంది.  గూగుల్ మీట్, గూగుల్ చాట్ రెండింటిలోనూ ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ​ ఫీచర్​ కోసం నెలకు 10 డాలర్లు కట్టాలి.

గూగుల్ ఛాట్  

గూగుల్​ ఛాట్​ ఇప్పుడు మనకు కొన్ని ఆన్సర్స్ కూడా ఇస్తుంది. ఎలా అంటే.. జెమిని ఏఐ సాయంతో జవాబులు చెబుతుంది. మనం ఏదైనా ప్రశ్న అడిగితే.. గూగుల్ ఛాట్‌లో ఉంటే జెమిని ఏఐ స్పందించి బదులిస్తుంది.అంతేకాదండోయ్.. 69 భాషల్లో ఆటోమేటిక్​గా మెసేజ్​లను ఇది అనువాదం చేయగలదు. 4,600 యూజర్ పెయిర్స్​ను ఇది సపోర్ట్ చేయగలదు.

గూగుల్ డాక్స్

గూగుల్ డాక్స్ కూడా చాలామంది నిత్యం వాడుతుంటారు. ఫొటోలను కూడా మనకు కావాల్సిన సైజులో గూగుల్ డాక్స్‌లో సేవ్ చేసుకునేలా త్వరలో గూగుల్​ డ్రైవ్​ను అప్​డేట్ చేయనున్నారు. ఇందులో ఒక కొత్త ట్యాబ్‌ను గూగుల్ డాక్స్‌లో అందుబాటులోకి తెస్తారు. మనకు కావాల్సిన సమాచారమంతా ఒక డాక్యుమెంట్​లోనే ఉంచుకునే గొప్ప వెసులుబాటు గూగుల్​ డాక్స్.

Also Read : Lal Bihari Vs Modi : ప్రధాని మోడీపై పోటీలో లాల్​ బిహారీ.. ఎవరో తెలుసా ?

గూగుల్ షీట్స్

గూగుల్ షీట్​ కూడా అత్యధికంగా వినియోగంలో ఉండే మరో గొప్ప యాప్. మనకు కావాల్సిన ఫార్మాట్​లో డేటాను సులభంగా మార్చుకోవడానికి ఈ యాప్‌లో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నారు. దానిపేరే   న్యూ టేబుల్​ ఫీచర్. మన డేటాను ఆర్గనైజ్ చేసుకోవడానికి వివిధ రకాల టెంప్లేట్స్​ సైతం  అందుబాటులోకి తెస్తారని తెలుస్తోంది.

ఏఐ మీటింగ్ యాడాన్

గూగుల్ డ్రైవ్​లో మనం చాలా సమాచారాన్ని, ఫైళ్లను సేవ్ చేస్తుంటాం. అందులో సెన్సిటివ్ సమాచారం, ఫైల్స్ కూడా ఉంటాయి. ఏఐ మీటింగ్ యాడాన్ ఫీచరుతో అలాంటి డేటాకు రక్షణ కల్పించవచ్చు.

హెల్ప్​ మీ రైట్

చాలామంది  నిత్యం జీమెయిల్స్ వాడుతుంటారు. జీమెయిల్స్‌లో ఏదైనా విషయాన్ని టైప్ చేసే విషయంలో మనకు ఉపయోగపడే ఫీచరే ‘హెల్ప్ మీ రైట్’.  జర్నీలో ఉన్న టైంలో మనం తడబడకుండా విషయాన్ని జీమెయిల్ ‌లో టైప్  చేయడానికి ఈ ఫీచర్ దోహదం చేస్తుంది. సింపుల్​గా ఒక్క క్లిక్ చేసి.. మీరు ఏదైనా నోటితో  చెబితే ఆ మ్యాటర్ అంతా టెక్ట్స్ రూపంలో టైపై పోతుంది.

Also Read :Watermelon: మీరు పుచ్చ‌కాయ కొంటున్నారా..? అయితే ఈ వార్త మీ కోస‌మే..!