Google Free Courses : గూగుల్ ఉచిత ఏఐ కోర్సులతో ఉద్యోగానికి బాటలు

Google Free Courses : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ యుగమిది..  దానికి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటే బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 04:23 PM IST

Google Free Courses : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ యుగమిది..  దానికి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటే బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అందుకే ఆయా కోర్సులకు ఇప్పుడు భారీ  డిమాండ్ నెలకొంది. వాటిలో చేరే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. అయితే భారీ ఫీజులు చెల్లించి ఏఐ కోర్సులు నేర్చుకునే స్థోమత చాలామందికి ఉండదు. అలాంటివారికి గూగుల్ ఒక గుడ్  న్యూస్ వినిపించింది. ​ పూర్తి ఉచితంగా కొన్ని రకాల ఆన్​లైన్​ ఏఐ కోర్సులు తీసుకొచ్చింది. ​ విద్యార్థులతో పాటు ప్రొఫెషన ఈ  కోర్సులను ఉచితంగా నేర్చుకోవచ్చు. దీనివల్ల స్కిల్స్  అప్​గ్రేడ్ అవుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి.  గూగుల్ అందిస్తున్న ఫ్రీ ఏఐ కోర్సుల(Google Free Courses) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

Introduction To Large Language Models 

ఇంట్రడక్షన్ టు లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్  కోర్సులో దాని పేరుకు తగిన విధంగానే లార్జ్ లాంగ్వేజ్​ మోడల్స్ గురించి ఉంటుంది.  లార్జ్ లాంగ్వేజ్​ మోడల్స్ ​ ఉపయోగం ఏమిటి? వాటిని ఎలాంటి సందర్భాల్లో వాడాలి? ప్రాంప్ట్​ ట్యూనింగ్ ఎలా చేయాలి? అనే విషయాలను ఈ కోర్సులో మనకు నేర్పిస్తారు.

Introduction To Responsible AI

ఇంట్రడక్షన్ టు రెస్పాన్సిబుల్ ఏఐ కోర్సులో రెస్పాన్సిబుల్​ ఏఐ కాన్సెప్ట్ గురించి వివరిస్తారు. గూగుల్ తమ ప్రొడక్టుల్లో ఈ ‘రెస్పాన్సిబుల్ ఏఐ’ టెక్నాలజీని ఏ విధంగా అమలు చేస్తుందనే వివరాలను ఇందులో తెలుపుతారు.

Generative AI Fundamentals

జనరేటివ్ ఏఐ ఫండమెంటల్స్ కోర్సు ​ ద్వారా జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్​ మోడల్స్​, రెస్పాన్సిబుల్​ ఏఐ టెక్నాలజీలను సులువుగా మనం నేర్చుకోవచ్చు.

Introduction To Image Generation

ఇంట్రడక్షన్ టు ఇమేజ్ జనరేషన్ కోర్సులో థియరీతోపాటు ఇమేజ్ జనరేషన్​ గురించి మనకు నేర్పిస్తారు. వెర్టెక్స్​ ఏఐ ట్రైనింగ్​, డిప్లాయిమెంట్​ గురించి తెలియజేస్తారు.

Also Read :Star Cricketers : భార్యలతో మెగా క్రికెటర్ల ఫొటోలు.. అట్టహాసంగా అనంత్ ప్రీ వెడ్డింగ్

Encoder – Decoder Architecture

ఎన్ కోడర్ డీకోడర్ ఆర్కిటెక్చర్  కోర్సులో ‘మెషీన్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్​’ గురించి మనకు నేర్పిస్తారు. దీనిని ఉపయోగించి సీక్వెన్స్​-టు-సీక్వెన్స్​ టాస్క్​లు ఎలా పూర్తి చేయాలి అనేది మనకు తెలుస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ఇచ్చిన పూర్తి సమాచారానికి సారాంశం చెప్పడం, ఒక భాషలోని టెక్ట్స్​ను మరోభాషలోకి అనువాదం చేయడం లాంటి టాస్క్​లను ఎలా పూర్తి చేయాలో ఇందులో మనకు నేర్పుతారు.

Attention Mechanism

అటెన్షన్ మెకానిజం కోర్సులో భాగంగా ఇన్​పుట్ సీక్వెన్స్​లోని నిర్దిష్ట భాగాలపై ఫోకస్​ చేసేందుకు న్యూరల్ నెట్​వర్క్​ను ఏ విధంగా ఎనేబుల్​ చేయాలి? అనే టెక్నిక్​లను ఈ కోర్సులో మనకు నేర్పిస్తారు.

Create

క్రియేట్  కోర్సులో ఇమేజ్ క్యాప్షనింగ్​ మోడల్స్ గురించి, ఎన్​కోడర్​-డీకోడర్​ ఆర్కిటెక్చర్​ గురించి మనకు నేర్పిస్తారు.

Introduction To Generative AI Studio

ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ స్టూడియో కోర్సులో జనరేటివ్ ఏఐ స్టూడియో గురించిన ప్రాథమిక అంశాలను మనకు తెలియజేస్తారు. దీనిని ఉపయోగించి మనం యాప్‌ల కోసం కస్టమైజ్డ్ జనరేటివ్ ఏఐ మోడల్స్​ను రూపొందించుకోవచ్చు. అలాగే ప్రోటోటైప్​ మోడల్స్​ను కూడా తయారు చేయొచ్చు.

Also Read :Pak New PM : ప్రధానిగా ఆయన్ను ఎన్నుకున్న పాక్ పార్లమెంట్.. రేపే ప్రమాణం