Bard by Google: గూగుల్ బార్డ్ వచ్చేసింది.. ప్రయోగాత్మకంగా యూఎస్‌, యూకేలో రిలీజ్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ విభాగంలో Microsoft, OpenAI కంపెనీలు కలిసి తెచ్చిన ChatGPT కి పోటీ ఇచ్చేందుకు Google రంగంలోకి దిగింది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ విభాగంలో Microsoft, OpenAI కంపెనీలు కలిసి తెచ్చిన ChatGPT కి పోటీ ఇచ్చేందుకు Google రంగంలోకి దిగింది. Bard పేరుతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ చాట్ బోట్ ను రంగంలోకి దింపింది.ఇది ఆన్‌లైన్‌లో మనం పని చేసే తీరుని సమూలంగా మార్చేస్తుందని భావిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే గూగుల్‌ కంపెనీ Bard చాట్‌బాట్‌ను అనౌన్స్‌ చేసింది. అయితే ఇప్పుడు దాన్ని తొలిసారి లిమిటెడ్ గా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే కొంతమంది పిక్సెల్ వినియోగదారులకు బార్డ్‌ను టెస్ట్‌ చేయడానికి గూగుల్‌ ఆహ్వానం పంపింది. యూఎస్‌, యూకేలోని పరిమిత సంఖ్యలో వినియోగ దారులకు మాత్రమే బార్డ్ అందు బాటులో ఉంటుంది. పిక్సెల్ సూపర్‌ ఫ్యాన్స్ సహా కొందరు ఇప్పటికే దీనికి యాక్సెస్‌ పొందారు. ఇతరులు వెయిట్‌ లిస్ట్‌లో జాయిన్‌ అయి బార్డ్‌ని టెస్ట్‌ చేసే అవకాశం పొందొచ్చు. ఈ అవకాశం కూడా కేవలం US, UK లోని వినియోగ దారులకు మాత్రమే.

బార్డ్ (Bard) ఇంటర్‌ ఫేస్ ఎలా ఉంది?

గూగుల్‌ అనౌన్స్‌మెంట్‌ లో ఉన్న స్క్రీన్‌షాట్‌లలోని బార్డ్ ఇంటర్‌ఫేస్ ను గమనిస్తే.. అది బింగ్‌ ఏఐ(Bing AI)ని పోలి ఉన్నట్టు కనిపిస్తోంది.
ప్రతి రెస్పాన్స్‌ కింద థంబ్స్ అప్, థంబ్స్ డౌన్, రిఫ్రెష్ యారో, గూగుల్ ఇట్ వంటి నాలుగు బటన్‌లు ఉన్నాయి. వ్యూ అదర్‌ డ్రాఫ్ట్స్‌ బటన్‌ ద్వారా వినియోగదారులు ఇతర రెస్పాన్స్‌లను కూడా చూసే ఫీచర్ ఉంది. ఎర్రర్స్‌ను నివారించడానికి Google “గార్డ్‌రైల్స్”ని అమలు చేస్తోంది. అయినా బార్డ్ ఎల్లప్పుడూ ఖచ్చితమైన ప్రతిస్పందనలను అందించకపోవచ్చని కంపెనీ హెచ్చరించింది. బార్డ్‌ను మెరుగుపరచడంలో సహాయపడటానికి గూగుల్‌ తన వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను సేకరించే పనిలో ఉంది. కోడింగ్, మల్టిపుల్‌ లాంగ్వేజ్‌లు, మల్టీమోడల్ ఎక్స్‌పీరియన్సెస్‌ వంటి సామర్థ్యాలను Bard కు జోడించే పనిలో గూగుల్ ఇంజినీర్లు బిజీబిజీగా ఉన్నారు. గూగుల్‌ ప్రకారం.. బార్డ్ అనేది గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌కి ప్రత్యామ్నాయం కాదు. గూగుల్‌ సెర్చ్‌ ఫంక్షన్‌కి ఇది కేవలం సహకరిస్తుంది.

Also Read:  Ugadi Horoscope 2023: ఈ కొత్త సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి ఫలితాలు వస్తాయి?