గూగుల్ ఇటీవల పరిచయం చేసిన “AI ఓవర్‌వ్యూస్” (Google AI Overviews) అనే కొత్త సెర్చ్ ఫీచర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫీచర్ ఉద్దేశ్యం వినియోగదారులకు తక్షణ, సంగ్రహ సమాచారాన్ని అందించడం. కానీ ఇది కొన్నిసార్లు తప్పుడు సమాచారం ఇవ్వడం, సరైన సమాధానాలు ఇవ్వకపోగా తప్పుడు సమాచారం ఇస్తుండడం వల్ల వినియోగదారుల మధ్య భయాలు, అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉదాహరణ కు ఒక వినియోగదారుని ప్రశ్నకు గూగుల్ “పిజ్జా సాస్‌కి జిగురు కలపండి” అన్న సలహా ఇవ్వడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇది కేవలం అసాధారణ సలహానే కాక, ఆరోగ్యపరంగా ప్రమాదకరమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Samantha: సమంతతో రాజ్ నిడిమోరు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్!
ఇటువంటి తప్పుడు సమాధానాలు AI “హాల్యూసినేషన్స్” అనే ఫెనామెనాను సూచిస్తున్నాయి. అంటే ఎఐ తన డేటా ఆధారంగా నిజంగా జరిగినట్లుగా కల్పిత సమాధానాలను ఇవ్వడం. అలాగే “బ్యాడ్జర్‌ను రెండుసార్లు నాకలేరు” వంటి అసభ్య పదజాలంతో కూడిన సమాధానాలు కూడా ఈ టూల్ నుంచి వచ్చినట్లు కనిపించాయి. ఈ విషయంలో గూగుల్ సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తూ, జిగురు సలహా ఒక పాత రెడ్డిట్ పోస్ట్ ఆధారంగా వచ్చిందని చెప్పింది. అయితే AI నిష్పత్తుల్లో హాల్యూసినేషన్స్ రేటు గూగుల్ ప్రకారం 0.7 నుండి 1.3 శాతం అని చెబుతుండగా, ఇతర పరిశోధనా సంస్థలు ఇది 1.8 శాతం అని పేర్కొంటున్నాయి.
Kaleshwaram Inquiry : హరీష్ రావు ను కాళేశ్వరం కమిషన్ ఏ ఏ ప్రశ్నలు అడిగారంటే !!
ఇక అసలైన సమస్య ఏమిటంటే.. ఈ ఎఐ టూల్ వల్ల నమ్మదగిన వార్తా వెబ్‌సైట్లకు వచ్చే ట్రాఫిక్ 40-60% వరకు తగ్గినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఇది నిజమైన జర్నలిజాన్ని హానికరంగా ప్రభావితం చేస్తోంది. పైగా గూగుల్ AI తన ఉత్పత్తులపై ప్రశ్నలు అడిగినపుడు అవి తక్కువగా చూపించి, స్పష్టమైన సోర్సెస్ లేకుండా సమాధానాలు ఇస్తున్న తీరు నిపుణుల ఆందోళనకు కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో, టెక్నాలజీపై ఆధారపడే సమాజంలో ఈ ఎఐ టూల్స్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయా? అన్న ప్రశ్న మరింత ఉత్కంఠకు దారి తీస్తోంది.